TDP : బ్రేకింగ్ టీడీపీ ఎమ్మెల్సీకి షాక్, పదవి పోయినట్టేనా…?

Authored By venkat G | The Telugu News | Published on: January 25, 2022, 3:15 pm

TDP : ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుంది. కొందరు కీలక నేతలపై ఇప్పటికే కేసులు నమోదు చేయగా మరికొందరు నేతలను గట్టిగానే టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీద ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అశోక్ బాబుపై సిఐడీ అధికారులు కేసు నమోదు చేసారు.

సర్టిఫికేట్ విషయంలో ఆయన అక్రమాలకూ పాల్పడ్డారనే ఆరోపణల నేపధ్యంలో సీరియస్ గా ఫోకస్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ పదోన్నతి కోసం గానూ ఆయన నకిలీ సర్టిఫికేట్ ఇచ్చాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే అది టైపు మిస్టేక్ అని అప్పటి ప్రభుత్వం ఫిర్యాదుని క్లోజ్ చేసేసింది.

breaking news to tdp mlc

breaking news to tdp mlc

అయితే ఇప్పుడు అనూహ్యంగా దీనిపై లోకాయుక్తకు ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేయడంతో లోకాయిక్త ఆదేశాలతో సిఐడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న అశోక్ బాబు ఆ తర్వాత టీడీపీ లో జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్న ఆయనపై ఈ కేసు గనుక ఋజువు అయితే మాత్రం పదవి పోయే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.

venkat G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp