Butchaiah Chaudhary : ఎనభై ఏళ్ళ వయసులోను బుచ్చయ్య చౌదరి దూకుడు తగ్గలేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Butchaiah Chaudhary : ఎనభై ఏళ్ళ వయసులోను బుచ్చయ్య చౌదరి దూకుడు తగ్గలేదు..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Butchaiah Chaudhary : ఎనభై ఏళ్ళ వయసులోను బుచ్చయ్య చౌదరి దూకుడు తగ్గలేదు..!

  •  తొలి అడుగు కార్యక్రమంలో బుచ్చయ్య చౌదరి జోష్ చూసి కుళ్లుకుంటున్నారు

Butchaiah Chaudhary : తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీలో అహర్నిశలు శ్రమిస్తున్న నేతల్లో ప్రముఖుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, మంత్రిగా కూడా పని చేశారు. 2024 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి మరోసారి గెలుపొందిన గోరంట్ల, ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి లభించకపోయినా, పార్టీపై ఆయనకున్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. పార్టీ చేపట్టిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న గోరంట్ల, ప్రజల దాకా స్వయంగా వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు.

Butchaiah Chaudhary ఎనభై ఏళ్ళ వయసులోను బుచ్చయ్య చౌదరి దూకుడు తగ్గలేదు

Butchaiah Chaudhary : ఎనభై ఏళ్ళ వయసులోను బుచ్చయ్య చౌదరి దూకుడు తగ్గలేదు..!

Butchaiah Chaudhary : బుచ్చయ్య చౌదరి గారు ఈ వయసులో ఆ స్పీడ్ ఏంటి..?

ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఎండను తట్టుకుని, ఎటువంటి సపోర్ట్ లేకుండా ప్రతి గ్రామంలో తానే తిరుగుతూ, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న గోరంట్ల ధీరత్వం అందరికీ ఆదర్శంగా మారుతోంది. రైతుల కోసం పొలం గట్ల వద్దకే వెళ్లి వారి కష్టాలను తెలుసుకోవడం, గడపగడపకూ వెళ్లి ప్రభుత్వం మంచి చేసిన విషయాలను వివరించడం చూస్తే, ఆయనలోని ప్రజానాయకత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఓ పెద్దాయనలా కాదు, ఓ శక్తివంతుడైన కార్యకర్తలా కనిపిస్తున్నారు. ఆయన పట్టుదల, పని తీరుపై జనాలు ముచ్చటపడుతున్నారు.

ఇంతకీ ఇది గోరంట్ల చివరి ఎన్నికలే అని అనుకున్నవారు చాలామంది. కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రజాసేవా పర్యటనలు చూస్తుంటే, ఆయన 2029 ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో రాజమండ్రి రూరల్ మళ్లీ తనకు దక్కుతుందని గోరంట్ల ఆశిస్తున్నారు. పైగా కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి బరిలోకి దిగే అవకాశాలపై చర్చ సాగుతోంది. మొత్తానికి రాజకీయ భీష్మాచార్యుడిగా గుర్తింపు పొందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజకీయ నాటౌట్‌గా కొనసాగుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది