Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి స్పెషల్ ప్యాకేజ్.. ఇక ప్రైవేటీకరణ లేనట్టే..!
Vizag Steel Plant : ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండగా ఆంధప్రదేష్ andhra pradesh అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అందుకు అనుగుణంగానే వారాలు కురిపిస్తుంది. ఏపీకి ఇప్పటికే స్పెషల్ ప్యాకేజి ఇచ్చిన కేంద్రం మరోసారి తాజాగా ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటించింది. ముఖ్యంగా Vizag Steel Plant వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 11,440 కోట్ల దాకా ప్యాకేజ్ కోసం క్యాబినెట్ ఆమోదించినట్టు తెలుస్తుంది.
దీనికి సంబందించిన విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ Ashwini Vaishnaw వెల్లడించారు. మొన్నటిదాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని ఏపీ ప్రజలు భయాందోళనలు పడ్డారు. కానీ కేంద్రం ఆర్ధిక ప్యాకేజి ప్రకటించడంతో ఇక వైజాగ్ స్టీ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనట్టే అని ఫిక్స్ అయ్యారు.
Vizag Steel Plant ఏపీ అభివృద్ధే లక్ష్యంగా..
అంతేకాదు ఉత్తరాంధ్రకు భారీ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. Vizag Steel Plant వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్ర విమానయాణ మంత్రి, ఉత్తరాంధ్ర ఎంపీ కింజారపు రామోహన్ నాయుడు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా కూటమి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తో రాష్ట్రానికి కావాల్సిన ఆర్ధిక సాయాన్ని వచ్చేలా చేస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో ఏపీ ప్రజలు కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలైతే సంతోషంగా ఉన్నారు. Vizag, Vishapatnam Steel Plant, Central Government, Vizag Steel Plant News