CM Chandrababu : “బూతులు.. హత్యలు.. అబద్ధాలు”: వైసీపీ ఐదేళ్ల చీకటి పాలనను ఎండగట్టిన చంద్రబాబు !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 25 February 2026, 7:30 pm
  •  CM Chandrababu : సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన : అసత్య ప్రచారాలపై మండిపాటు

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కెమికల్స్‌తో తయారు చేసిన నెయ్యితో 20 కోట్ల లడ్డూలను Thirumala Thirupathi Laddu సిద్ధం చేసి దేవుడికి నైవేద్యం పెట్టారని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా వేంకటేశ్వర స్వామిని వైసీపీ నాయకులు అవమానించారు.  ఏ సంబంధం లేకపోయినా హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు చేయడం రాజకీయ దుష్ప్రచారానికి నిదర్శనమని అన్నారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరమని సీఎం తెలిపారు. “నేను ఎప్పుడైనా అసభ్యంగా మాట్లాడానా? అవినీతిపరులు నాపై బూతులు తిడితే నేను సహించాలా?” అని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాల క్రితం మరణించిన తన తల్లిని, తన భార్యను కూడా దూషించడం రాజకీయ సంస్కృతి కాదని ఆయన విమర్శించారు.

CM Chandrababu : "బూతులు.. హత్యలు.. అబద్ధాలు": వైసీపీ ఐదేళ్ల చీకటి పాలనను ఎండగట్టిన చంద్రబాబు !

CM Chandrababu : “బూతులు.. హత్యలు.. అబద్ధాలు”: వైసీపీ ఐదేళ్ల చీకటి పాలనను ఎండగట్టిన చంద్రబాబు !

గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని ఆయన ఆరోపించారు. ఇంటి బయటకు రావాలంటే కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రజల ఓట్లతోనే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించానని, ప్రజాస్వామ్య విధానాల ప్రకారమే ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. ఇక ప్రతిపక్ష హోదా అంశంపై కూడా ఆయన స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.

జగన్ బయటకు వస్తే విధ్వంసం, నేరాలు, ఘోరాలే జరుగుతాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు మంచివి కావని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమని, రాజకీయ కక్ష సాధింపు తన విధానం కాదని స్పష్టం చేశారు.

 

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి