AP Elections : చాణిక్య స్టాటజీ సర్వే.. ఏపీలో అధికారం వాళ్లదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Elections : చాణిక్య స్టాటజీ సర్వే.. ఏపీలో అధికారం వాళ్లదే..!

 Authored By anusha | The Telugu News | Updated on :1 January 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Elections : చాణిక్య స్టాటజీ సర్వే.. ఏపీలో అధికారం వాళ్లదే..!

AP Elections : 2024 ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ సీపీ పార్టీ గెలవడానికి జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని సర్వేలను కూడా చేయించుకున్నాయి. తాజాగా చాణిక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం ఏ పార్టీ గెలుస్తుంది అనే వివరాలను వెల్లడించింది. జనసేన, టీడీపీ కూటమి ఏకంగా 115 – 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. అధికార వైసిపి కేవలం 42 – 55 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 18 సీట్లలో హోరాహోరీ పోటీ ఉండనున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కాకుండా ఇతరులకు 4 – 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ఇంతవరకు ఏపీలో ఇండిపెండెంట్ కి అన్ని సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈ సర్వే ఇండిపెండెంట్ కి ఏకంగా 7 సీట్లు వస్తాయని చెబుతుంది. 175లో 115 – 128 సీట్లు టీడీపీకే వస్తాయని, ఇదే ప్రభుత్వాన్ని పాలిస్తుందని సర్వే చెబుతోంది. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలో శ్రీకాకుళంలో 10 సీట్లకు టిడిపి , జనసేన – 8 , వైసీపీ 2 , విజయనగరంలో టిడిపి -4 వైసీపీకి – 4, విశాఖపట్నంలో టీడీపీ – 11 వైసీపీ – 2 తూర్పుగోదావరిలో 19 లో టీడీపీ – 16 , వైసీపీ – 2 పశ్చిమగోదావరిలో టీడీపీ – 12, వైసీపీ – 2 , కృష్ణాజిల్లాలో 16లో టిడిపి – 12 వైసీపీ – 2 గుంటూరులో 17 లో టిడిపి – 12 వైసీపీ – 5,ప్రకాశం జిల్లాలో 12 లో టిడిపి- 12 వైసీపీ – 3 నెల్లూరులో 10 లో టిడిపి – 6 వైసీపీ – 4

కర్నూలులో 14లో టిడిపి -5 వైసీపీ – 7 అనంతపురం 14 లో జనసేన – 10 వైసీపీ – 3 మరో సీటులో గట్టి పోటీ. పార్టీల వారీగా టిడిపికి 43% వైసీపీకి 41 శాతం జనసేనకి 10 శాతం ఓటు బ్యాంకు రాబోతుంది. ఇతరులకు కూడా ఆరు శాతం ఓటు బ్యాంకు రాబోతుందని సర్వే తెలిపింది. చాణిక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం చూస్తే ఏపీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి, జనసేన పొత్తు లేకపోతే టిడిపి వైఎస్ఆర్ సిపి పార్టీ మధ్య హోరాహోరి పోటీ నడిచేది. కానీ టిడిపి జనసేన పొత్తు వలన అధికారంలోకి టిడిపి పార్టీ వస్తుందని ఈ సర్వే చెబుతుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది