Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ప్ర‌త్యేక ఛాంబ‌ర్.. ఎప్పుడు బాధ్య‌త‌లు అందుకోనున్నారు అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ప్ర‌త్యేక ఛాంబ‌ర్.. ఎప్పుడు బాధ్య‌త‌లు అందుకోనున్నారు అంటే..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి.. యాక్షన్‌లోకి దిగారు. పోలవరం పర్యటనకు కూడా వెళ్లారు. ఇక పలువురు మంత్రులు కూడా తమ‌కు కేటాయించిన మంత్రిత్వశాఖల బాధ్యతలు స్వీకరించి.. సంబంధిత శాఖపై పట్టు పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్‌గా మారారు. ఆయనకు సంబంధించిన ఏ వార్త […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 June 2024,5:00 pm

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి.. యాక్షన్‌లోకి దిగారు. పోలవరం పర్యటనకు కూడా వెళ్లారు. ఇక పలువురు మంత్రులు కూడా తమ‌కు కేటాయించిన మంత్రిత్వశాఖల బాధ్యతలు స్వీకరించి.. సంబంధిత శాఖపై పట్టు పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్‌గా మారారు. ఆయనకు సంబంధించిన ఏ వార్త అయిన నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. రీసెంట్‌గా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ కోసం.. చంద్రబాబు దగ్గరలోనే కొత్త ఛాంబర్ ఏర్పాటు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

Pawan Kalyan ముహూర్తం ఫిక్స్..

కాని సచివాలయంలో మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం రెడీ చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు సమకూరుస్తున్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా నియమించారు. అలాగే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. దీనిపై ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan పవన్ కళ్యాణ్ కి ప్ర‌త్యేక ఛాంబ‌ర్ ఎప్పుడు బాధ్య‌త‌లు అందుకోనున్నారు అంటే

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ప్ర‌త్యేక ఛాంబ‌ర్.. ఎప్పుడు బాధ్య‌త‌లు అందుకోనున్నారు అంటే..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఈనెల 19న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేన పార్టీ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కల్యాణ్.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఈనెల 12న పవన్‌ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన అభిష్టం మేరకు శాఖలు కేటాయించారు. ఇప్పటికే తెలుగుదేశం, బీజేపీకి చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయించగా, మంచి ముహూర్తం చూసుకొని, ఆయా మంత్రులు తమకు కేటాయించిన ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. అధికారం చేపట్టిన అనంతరం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది