Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి.. యాక్షన్‌లోకి దిగారు. పోలవరం పర్యటనకు కూడా వెళ్లారు. ఇక పలువురు మంత్రులు కూడా తమకు కేటాయించిన మంత్రిత్వశాఖల బాధ్యతలు స్వీకరించి.. సంబంధిత శాఖపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్‌గా మారారు. ఆయనకు సంబంధించిన ఏ వార్త అయిన నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రీసెంట్‌గా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ కోసం.. చంద్రబాబు దగ్గరలోనే కొత్త ఛాంబర్ ఏర్పాటు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.
కాని సచివాలయంలో మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం రెడీ చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు సమకూరుస్తున్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా నియమించారు. అలాగే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. దీనిపై ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఈనెల 19న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేన పార్టీ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఈనెల 12న పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన అభిష్టం మేరకు శాఖలు కేటాయించారు. ఇప్పటికే తెలుగుదేశం, బీజేపీకి చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయించగా, మంచి ముహూర్తం చూసుకొని, ఆయా మంత్రులు తమకు కేటాయించిన ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. అధికారం చేపట్టిన అనంతరం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.