
N chandrababu naidu
Chandra Babu Naidu : ఏపీ పంచాయితీ ఎన్నికల విషయమై నెల కొన్న ప్రతిష్టంభన తొలగి పోవడంతో పాటు ఎన్నికల పక్రియ కూడా పూర్తి అయ్యింది. హైకోర్టు మరియు సుప్రీం కోర్టులు ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ నిమ్మగడ్డ రమేష్ కు అనుకూలంగా తీర్పు ను ఇవ్వడంతో టీడీపీ ఫుల్ హ్యాపీగా ఎన్నికలకు సిద్దం అయ్యింది. వైకాపా ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ రమేష్ ఉన్న సమయంలో ఎన్నికలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ తెలుగు దేశం పార్టీ మొదటి నుండి ఆరోపించింది. అందుకే నిమ్మగడ్డ ఉన్న సమయంలో నే పంచాయితీ ఎన్నికలు పూర్తి అవ్వాలని తెలుగు దేశం పార్టీ బలంగా కోరుకుంది. ఈ పంచాయితీ ఎన్నికల్లో వైకాపా ను అడ్డుకునేందుకు తెలుగు దేశం చేయని ప్రయత్నాలు లేవు. అయినా కూడా మూడవ స్థానంకు పడిపోవడంతో దారుణంగా చంద్రబాబు నాయుడు కింద మీద పడుతున్నాడు.
తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ ఫలితాలను ఊహించలేదు. ప్రతిపక్ష పార్టీగా గౌరవ ప్రథంగా అయినా పంచాయితీలు దక్కుతాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా వారికి ప్రతిపక్ష హోదా గల్లంతు అయ్యింది. ఈ పరిణామం ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు లో కూడా వైకాపా ఘన విజయాలను దక్కించుకుని దుమ్ము రేపింది. చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ పిల్లి మొగ్గలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు నారా వారి పల్లెలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి గెలవడంతో కాస్త ఊపిరి పీల్చుకుని హ్యాపీగా ఉన్నారు. అక్కడ కూడా కాస్త గట్టిగానే వైకాపా పోరాటం చేసింది.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఫలితాలపై పైకి మేక పోతు గాంభీర్యం పలుకుతూ అధికార పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం కు పాల్పడి విజయాలను దక్కించుకున్నారు అంటూ చెబుతున్నా లో లోపల మాత్రం కుమిలి పోతున్నట్లుగా ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. పెద్ద ఎత్తున పంచాయితీ ఎన్నికల్లో నిరాశ పర్చడంకు తోడు నెం.2 స్థానంను జనసేన దక్కించుకోవడంతో ముందు ముందు పరిస్థితి ఏంటీ అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు సొంత ఇలాకాలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు అవ్వడం దారుణం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు కు ఇలాంటి ఫలితాలే తప్పక పోవచ్చు అంటున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.