Janasena : జనసేన పార్టీ పంచాయితీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించింది అంటూ ఆ పార్టీ నాయకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అధికార పార్టీ వైకాపా మెజార్టీ పంచాయితీలను దక్కించుకుంది. సాదారణంగా పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం కామన్ గా జరుగుతుంది. ఇక్కడ కూడా వైకాపా భారీ విజయాలను సొంతం చేసుకుంది. మెజార్టీ స్థానాల్లో వైకాపా సర్పంచ్ లు కొలువుదీరారు. ఏపీలో వైకాపా పంచాయితీ జోరు ముందు తెలుగు దేశం పార్టీ నిలువలేక పోయింది. తెలుగు దేశం పార్టీ ముందస్తుగా మానిఫెస్టోను విడుదల చేయడంతో పాటు అనేక రకాలుగా ప్రచారాలు చేసినా కూడా ఆ పార్టీకి నిరాశ తప్పలేదు. ఇక వైకాపా ముందు బీజేపీ ముందు కూడా తేలిపోయింది. కొన్ని చోట్ల బీజేపీ మరియు జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు నడిచింది. అయినా కూడా ఆ పార్టీకి పరాభవం తప్పలేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిచారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో వైకాపా తర్వాత స్థానంను జనసైనికులు దక్కించుకున్నారు. ఈ రేంజ్ లో సర్పంచ్ లు గెలుస్తారని ఎవరు ఊహించలేదు. జనసేన పెద్ద ఎత్తున పంచాయితీ లను గెలుచుకున్న నేపథ్యంలో పార్టీ అధికారికంగా మస్త్ ఖుషీగా ఉంది అంటూ ఒక భారీ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అందులో జనసేన మొత్తంగా 1209 మంది సర్పంచ్ లుగా గెలిచారు, 1576 మంది ఉప సర్పంచ్ లుగా గెలిచారు. ఇక 4456 మంది వార్డు మెంబర్స్ గా గెలవడంతో ఆ పార్టీ నాయకులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉండగా, ప్రధాన పార్టీ అయిన బీజేపీ ఉండగా కూడా జనసేన నెం.2 గా నిలవడం ఆ పార్టీ నాయకులకు కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉంది.
2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జనసేనకు రక్త కన్నీరు మిగిల్చింది. కనీసం పవన్ పోటీ చేసిన స్థానాల్లో కూడా ఓటమి ని చవి చూడటం జరిగింది. జనసేన తరపున రాపాక తప్ప మరెవ్వరు గెలువలేదు. దాంతో జనసేన కార్యకర్తలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమిని మర్చి పోయి వెంటనే పవన్ కళ్యాణ్ జనాల్లో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్ల ఫలితాలకు విభిన్నంగా సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి అంటూ టాక్ వినిపిస్తుంది. మొత్తానికి జనసేన సాధించిన విజయం ఆ పార్టీ నాయకులకు మరింత బూస్టింగ్ గా ఉంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.