Chandrababu 118 crore scam : 118 కోట్ల స్కాంలో తవ్వే కొద్దీ బయటపడుతున్న నిజాలు
Chandrababu 118 crore scam : చంద్రబాబునాయుడు ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయారు. త్వరలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు పంపించడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. నన్ను ఇవాళో రేపో అరెస్ట్ చేసినా చేస్తారు.. అన్ని రకాలుగా ఎన్ని అరాచకాలు చేయాలో చేస్తున్నారు అంటూ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. అసలు చంద్రబాబుకు ఐటీ అధికారులు ఎందుకు నోటీసులు పంపించారు అంటే.. ఆయన ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని.. అందులో తన ఆస్తులు అన్నీ వివరించలేదని చెప్పి ఐటీ శాఖ అధికారులు నోటీసులు పంపించారు.
118 కోట్ల విషయంలో మీరు ఐటీ రిటర్న్స్ లో ఫైల్ చేయలేదని.. ఆ ఆదాయానికి సరైన ఆధారాలు చూపించలేదని ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు కూడా హాజరు కావాలని చెబితే చంద్రబాబు హాజరు కాలేదు కానీ.. అసలు నాకు మీరు ఎలా నోటీసులు ఇస్తారు. జేఏవో ఆఫీసు నుంచి రావాలని కానీ ఏవో ఆఫీసు నుంచి ఎందుకు నోటీసు వచ్చింది.. అంటూ చంద్రబాబు వాళ్లను రివర్స్ లో ప్రశ్నించారు. అలాగే.. ఆ 118 కోట్లకు కూడా చంద్రబాబు క్లియర్ గా లెక్క చెప్పినట్టు తెలుస్తోంది.ఇదంతా పక్కన పెడితే ఐటీ నోటీసులకు రెస్పాండ్ కాకుండా దొంగచాటుగా తిరుగుతున్న చంద్రబాబు అరెస్ట్ ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబుకు క్లియర్ గా నోటీసులు పంపించినా..
Chandrababu 118 crore scam : చంద్రబాబు అరెస్ట్ ఖాయమేనా?
ఆయన ఆదాయంపై లెక్కలు తేల్చాలని చెప్పినా చంద్రబాబు డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని.. అందులో చంద్రబాబుతో పాటు చంద్రబాబు కొడుకు పేరు కూడా ఉంది. అందుకే చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. ఆయన్ను కూడా అరెస్ట్ చేసే చాన్స్ ఉంది. ఐటీ అధికారులకు చంద్రబాబు సహకరించడం లేదు. ఐటీ అధికారులకు చంద్రబాబు ఇలాగే సహకరించకపోతే ఇక ఆయన్ను అరెస్ట్ చేయడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.