YS Jagan : జగన్ ప్లానింగ్ చూసి ఉక్కిరిబిక్కిరి అవుతున్న పవన్ – బాబు !
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సరిగ్గా ఒక సంవత్సరం సమయం ఉంది. వచ్చే సంవత్సరం ఈ సమయం వరకు ఎన్నికలు అవుతాయి. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే ఏపీలోని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అయితే ఏ పార్టీ అయినా సరే.. ఉత్తరాంధ్ర మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ. అందులోనూ వైజాగ్ పరిపాలన రాజధాని కాబోతోంది. త్వరలోనే వైజాగ్ నుంచి పాలన సాగనుంది. వైజాగ్ నుంచి పాలన ప్రారంభం అయింది అంటే..
ఇక ఉత్తరాంధ్రలో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసినట్టే లెక్క.నిజానికి సీఎం జగన్ ప్లానింగ్ కూడా అదే. అందుకే ఎన్నికల కంటే ముందే ఎలాగైనా వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసి ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లను పార్టీ వైపు తిప్పుకోవడమే. జగన్ ప్లాన్ ను పసిగట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్సలు తట్టుకోలేకపోతున్నారు. వామ్మో.. ఇలాంటి ప్లాన్లు మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకే జగన్ ప్లాన్ ఇది. జగన్ ప్లానింగ్ ను ప్రతిపక్ష పార్టీల నేతలు అందుకోలేకపోతున్నారు. జగన్ ప్రస్తుత టార్గెట్ మొత్తం ఉత్తరాంధ్రకు షిఫ్ట్ అయిందని ఆలస్యంగా గ్రహించినా..
YS Jagan : జగన్ ప్లాన్ ను అందుకోలేకపోతున్న ప్రతిపక్ష పార్టీల నేతలు
చంద్రబాబు, పవన్ ఏం చేయలేకపోతున్నారు. ఉత్తరాంధ్రను స్వీప్ చేస్తే ఏపీ మొత్తాన్ని స్వీప్ చేసినట్టే అనేది స్పష్టం అవుతూనే ఉంది. దాన్ని ముందుగానే తెలుసుకొని సీఎం జగన్ వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే వైజాగ్ ను టార్గెట్ చేసి వైజాగ్ లోనే అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జీ220 సన్నాహక సదస్సును కూడా వైజాగ్ లో నిర్వహించారు. ఇటీవల మూలపేట పోర్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. వంశధార పథకం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా శంకుస్థాపన చేశారు. అదానీ డేటా సెంటర్, శ్రీకాకుళం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.. ఇలా ఉత్తరాంధ్రపైనే ప్రస్తుతం సీఎం జగన్ ఫోకస్ ఉంది. చూద్దాం మరి.. సీఎం జగన్ ప్లాన్ ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో.