Chandrababu : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్‌ల‌ని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు.. వ్యూహం ఏంటో తెలుసా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్‌ల‌ని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు.. వ్యూహం ఏంటో తెలుసా ?

 Authored By ramu | The Telugu News | Updated on :16 October 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్‌ల‌ని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు.. వ్యూహం ఏంటో తెలుసా ?

Chandrababu : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .. 26 జిల్లాల కు ఇంఛార్జ్‌ మంత్రుల్ని నియమించింది . ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం , ఇతర సమీకరణాల ఆధారంగా ఆయా జిల్లాల కు ఇంఛార్జ్ మంత్రుల్ని నియమించారు . ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు . ఏపీ కేబినెట్ లో మంత్రి నారా లోకేష్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల కు ఇంఛార్జ్ బాధ్యత లు అప్పగించలేదు . సాధారణం గా అందరు మంత్రుల కు జిల్లా ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారు . కానీ కొన్ని ప్రత్యేక కారణాలతో లోకేష్ , పవన్ కళ్యాణ్‌లను ఆ బాధ్యతల నుంచి దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది .

Chandrababu ఆచితూచి అడుగులు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ది ఉప ముఖ్యమంత్రి పదవి. అంటే ఆయన కూడా మొత్తం స్టేట్ చూసుకుంటారు. లోకేష్ కూడా రానున్న రోజుల‌లో కాబోయే ముఖ్య‌మంత్రి. ఈ ఇద్దరూ స్టేట్ లీడర్లు అయితే లోకేష్ ని జిల్లా ఇంచార్జి మంత్రిగా పంపిస్తే ఆయనని తగ్గించినట్లు అవుతుంది కదా అన్న లెక్కలేవో ఉన్నాయని అంటున్నారు. ఇంచార్జి మంత్రుల లిస్ట్ విడుదల చేశాక ఒక కొత్త విషయం తెలిసింది అని కూడా అంటున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి త్రిమూర్తుల మాదిరిగా చంద్రబాబు లోకేష్ బాబు పవన్ బాబు ఉంటూ పాలన సాగిస్తున్నారు అని అంటున్నారు.

Chandrababu ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ లోకేష్‌ల‌ని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు వ్యూహం ఏంటో తెలుసా

Chandrababu : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్‌ల‌ని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు.. వ్యూహం ఏంటో తెలుసా ?

అలాగే యువ మంత్రుల కు కీలకమైన జిల్లాల బాధ్యతలు అప్పగించడం విశేషం . మండిపల్లా రాంప్రసాద్ రెడ్డి కి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు బాధ్యత లు ఇచ్చారు . అలాగే కృష్ణా జిల్లా బాధ్యతల్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అప్పగించింది ప్రభుత్వం . ఇలా చంద్రబాబు మంత్రుల కు జిల్లా లు బాధ్యతలు ఇస్తూ ఉతర్వ‌లు జరీ చేశాడు అలాగే .. అందరికీ సమన్యాయం పాటిస్తూ అన్ని పార్టీల కు సమానంగా ఇచ్చాడు. అదే విధంగా పవన్ , లొకేష్ ను ఊహాత్మకంగా ప్రభుత్వ పనుల్లో బిజీ చేస్తూ జల్లీ ల బాధ్యతలు ఇవ్వకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు . అలాగే కూటమి ప్రభుత్వం మరింత పేరు వచ్చే విధంగా నియామకాలు ఉన్నాయి. లోకేష్ కూడా అనధికార డిప్యూటీ సీఎం ర్యాంకరే అని అంటున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది