cbn vizag
CBN : వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెందుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన… విశాఖకు పట్టిన ఏ2 శనిని వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపాకు బ్రహ్మాండమైన విజయం అందించాలని కోరారు. తెలుగుదేశంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
CBN
విశాఖలో దందాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.జగన్ ఏబీసీడీ పాలసీ పెట్టారని విమర్శించారు. ఏ అంటే ఎవరిపైన అయినా దాడులు చేస్తారని దుయ్యబట్టారు.
‘హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు ఇక్కడే 10 రోజులున్నా… విశాఖలో పరిస్థితి సాధారణం అయ్యాకే తిరిగివెళ్లా. ఏ ఒక్క అవకాశం వచ్చినా విశాఖకు తీసుకువచ్చా. లూలూ సంస్థ వస్తే పర్యాటకం అభివృద్ధి చెందాలనుకున్నా. విశాఖకు గతంలో ఉన్న శోభ ఇప్పుడు ఉందా? అదానీ, లూలూ సంస్థలు పారిపోయంటూ విమర్శలు చేశాడు.
జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును చంద్రబాబు ప్రకటించారు. పీలా శ్రీనివాస్‌ను గెలిపిస్తే ఇంటి పన్ను పెరగదని స్పష్టం చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపాకు బ్రహ్మాండమైన విజయం అందించాలని చంద్రబాబు ప్రజలను కోరారు. నీతి, నిజాయితీకి విశాఖ మారుపేరు అని కొనియాడారు. హుద్‌హుద్ తుపాను ధాటికి విశాఖ పెద్దఎత్తున దెబ్బతిందన్న ఆయన.. ఆనాడు విశాఖ తిరిగి కోలుకుంటుందో? లేదో? తెలియని పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు.
తుపాను వచ్చిన తర్వాత రోజే ప్రధాని విశాఖ వచ్చారని… ప్రధానితో కలిసి తాను కారులో వస్తుంటే ప్రజలు నవ్వుతూ స్వాగతం పలికారని చెప్పారు. నాడు విశాఖ ప్రజల స్వాగతం చూసి ప్రధాని ఆశ్చర్యపోయారన్నారు. విశాఖను ప్రపంచ పటంలో పెట్టామని.. నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశామని వెల్లడించారు. విశాఖను అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం తెదేపాకే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇక మరోపక్క విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవటానికి వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి విశాఖ లో విజయం సాధించటం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ఆంధ్రుల రాజధాని అనే ముద్ర పడిన విశాఖ లో మేయర్ పీఠం కు ఉన్న డిమాండ్ మామూలుది కాదు. అందుకే ఇరు పార్టీలు విజయం కోసం పోరాటం చేస్తున్నాయి. ఒక రకంగా చూసుకుంటే వైసీపీ కి ఇక్కడే ఎడ్జ్ కనిపిస్తుంది. టీడీపీ కి చెందిన కీలక నేతలు ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పైగా విశాఖను రాజధానిని చేసిన ఘనత కూడా వైసీపీ ఖాతాలో ఉంది కాబట్టి, వైసీప కి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.