KTR : హైదరాబాద్ లో ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. ఇప్పటికి కొన్ని 1990 సినిమాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ బస్సులను చూసిన సమయంలో ఇప్పుడు కూడా ఉంటే బాగుండేది. అలా హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ పై నుండి వ్యూ ను ఎంజాయ్ చేసే వాళ్లం కదా అనుకుంటున్న వారు చాలా మంది ఉంటారు. బడ్జెట్ సమస్య కారనంగా 2000 సంవత్సరం తర్వాత ఆ బస్సులను ఆర్టీసీ వారు రద్దు చేశారు. డబుల్ ఇంజిన్ తో పాటు డబుల్ మెయింటెన్స్ అవుతున్న కారణంగా వాటిని అధికారులు కనుమరుగు చేశారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి డబుల్ డెక్కర్ బస్సు ఫొటోలను కేటీఆర్ కు షేర్ చేయడంతో ఒక్కసారిగా మంత్రి కేటీఆర్ కూడా గతంలోకి వెళ్లి పోయాడు.
తాను కాలేజ్ లో ఉన్న రోజుల్లో రోడ్ల పై డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవని, వాటిని ఇప్పుడు రోడ్ల మీద ఎందుకు చూడలేక పోతున్నామో తాను తెలుసుకోవాలని ఉందంటూ ఆ ఫొటోలకు స్పందించాడు. కేటీఆర్ అడిగిన కొన్ని రోజుల్లోనే రవాణ శాఖ స్పందించింది. గతంలో ఉన్న ఆ బస్సులను మెయింట్స్ ఎక్కువ అవుతున్న కారణంగా తొలగించినట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ వాటిని తీసుకు వచ్చేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు అంటూ కేటీఆర్ రవాణ శాఖ అధికారులకు సూచించడంతో గత కొన్ని నెలలుగా ఆ దిశగా చర్చలు జరిగాయి. ఇప్పుడు ఉన్న బడ్జెట్ కు రోడ్లకు టికెట్ రేట్లకు అనుకూలమైన డబుల్ డెక్కర్ బస్సు మోడల్ ను తయారు చేయించారు.
హైదరాబాద్ రోడ్ల మీద మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు చూస్తామని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. కాని కేటీఆర్ పుణ్యమా అని 80 కిడ్స్ మళ్లీ రోడ్ల మీద తాము గతంలో ఎక్కిన డబుల్ డెక్కర్ బస్సులను చూడబోతున్నారు. గతంలో ఎక్కి తిరిగిన ఆ బస్సులను మళ్లీ ఇన్నాళ్లకు వారు ఎక్కబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే మంత్రి అది కూడ కేటీఆర్ వంటి వ్యక్తి తల్చుకుంటే కాకుండా ఉంటుందా. కేటీఆర్ పట్టుదలకు ఇది నిదర్శణంగా చెప్పుకోవచ్చు. ఈమద్య కాలంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు అయ్యాయి. కనుక వాటిని ఎలా ఈ డబుల్ డెక్కర్ బస్సులు అధిగమిస్తాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మొదట ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులను తీసుకు వచ్చి ఆ తర్వాత మరిన్ని బస్సులను తీసుకు వస్తారట. ఇప్పటికే బస్సుల కోసం కొటేషన్ లను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.