Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన విజయవంతం అయింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఈ నెల 16న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు, రోడ్ల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, ఏపీకి రావాల్సిన నిధులను కోరడం వంటి కీలక అంశాలు చర్చించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ ప్రధాని మోదీతో సమావేశమై రెండు గంటలపాటు చర్చించినట్లు సమాచారం.
చంద్రబాబు అలా ఢిల్లీ టూర్ ముగించుకుని ఏపీకి తిరిగి వచ్చారో కేంద్రం ఏపీకి శుభవార్త అందించింది. దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న విశాఖ రైల్వే జోన్ కలను సాకారం చేసేలా ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పచ్చ జెండా ఊపేశారు. రైల్వే జోన్ కి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని అతి తొందరలోనే విశాఖలో రైల్వే జోన్ ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు భూ కేటాయింపులు, ఇతర అంశాల మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిందని తెలిపారు.
విశాఖ రైల్వే జోన్ 1970 ప్రాంతంలో ఆనాటి విశాఖ ఎంపీ తెన్నేటి విశ్వనాధం తొలుత ఈ డిమాండ్ చేశారు. నాటి నుంచి ఈ డిమాండ్ పెరుగుతూ పోతుంది. 1990 దశకం తర్వాత కేంద్రం దేశంలో అనేక రైల్వే జోన్లను మంజూరు చేసినపుడు విశాఖ రైల్వే జోన్ ఆశలు చిగురించాయి. అయితే రైల్వే జోన్ కోసం సాగిన పోరాటాలపై కేంద్రం స్పందించలేదు.2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడం, విభజన హామీల్లో రైల్వే జోన్ ఉండడంతో ఇక జోన్ ఏర్పాటు ఖాయమని అంతా భావించారు. అనుకున్నట్టుగానే 2019లో కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే గడచిన అయిదేళ్ల కాలంలో అడుగు ముందుకు పడలేదు. తాజాగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కలను సాకరం చేస్తూ కేంద్రం ఏపీకి శుభవార్త అందించింది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.