chandrababu : ఏ తండ్రీ చేయలేనిది లోకేష్ కోసం చేసిన చంద్రబాబు – అయినా అట్టర్ ఫ్లాప్ ?
Chandrababu : టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. నారా లోకేష్ కనిగిరి నియోజకవర్గంలో నడుస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 2000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం జరిగింది. మొత్తం కనీసం నాలుగు వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంతో లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్ర.. రాయలసీమలో ప్రారంభం కాగా మరి కొద్ది రోజుల్లో టీడీపీ పట్టున్న కోస్తా ప్రాంతంలో అడుగుపెట్టనుంది. పరిస్థితి ఇలా ఉంటే లోకేష్ పాదయాత్ర.. ప్రజలను అంత ప్రభావితం చేసే రీతిలో పరిస్థితులు లేని నేపథ్యంలో చంద్రబాబు చాలా వినూత్నమైన ఆలోచన చేపట్టినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే ఈసారి లోకేష్ పాదయాత్ర విశేషాలు అన్నిటిని డిజిటల్ యాంకర్ వైభవితో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇచ్చే రీతిలో ఆలోచన చేయడం జరిగిందట.
ఇప్పటివరకు జరిగిన పాదయాత్రలో అనుకున్న స్థాయిలో హైప్ రాకపోవడంతో పాటు పురోగతి కూడా ఎక్కడా కనిపించకపోవడంతో కోస్తా ప్రాంతంలో లోకేష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియా పరంగా పాదయాత్రని మరింతగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే రీతిలో వ్యూహాలు సిద్ధం చేశారట. పొలిటికల్ గా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే మరోపక్క… లోకేష్ పాదయాత్రలో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. కోస్తా ప్రాంతంలో యువగళం పాదయాత్ర మొదలైన తరువాత సరికొత్త ఐడియాలజీతో.. లోకేష్ ప్రజలతో ఇంట్రాక్షన్ కాబోతున్నట్లు సమాచారం. ఒకపక్క అదే రీతిలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసే రీతిలో స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్.
మొదట నుండి లోకేష్ పాదయాత్రకి అనుకున్నంత రీతిలో ప్రజల నుండి రెస్పాన్స్ రాకపోవడంతో పాటు రాజకీయాలను కూడా పెద్దగా ప్రభావితం చేయలేకపోవడంతో చాలా వరకు అట్టర్ ఫ్లాప్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల పవన్ చేపట్టిన వారాహి యాత్రకు విపరీతమైన ఫోకస్ క్రియేట్ కావడంతోపాటు.. రాజకీయంగా చాలా సంచలనం సృష్టించింది. దీంతో ఏపీ రాజకీయాల్లో లోకేష్ పాదయాత్ర ఆటలో అరటిపండు అన్నట్టు మారిపోయింది. ఇలాంటి తరుణంలో కోస్తా ప్రాంతంలో లోకేష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింతగా పార్టీకి హైప్ వచ్చేలా.. చంద్రబాబు సరికొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం.