Chandrababu : చంద్రబాబుపై విమర్శలు.. ఆయన క్షమాపణలు కోరతారా..!
Chandrababu : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోకుండా సీఎం చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు […]
ప్రధానాంశాలు:
Chandrababu : చంద్రబాబుపై విమర్శలు.. ఆయన క్షమాపణలు కోరతారా..!
Chandrababu : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోకుండా సీఎం చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
Chandrababu చంద్రబాబుకి కొత్త తలనొప్పి
సిట్ కూడా ఏర్పాటైంది. ప్రధానంగా- తమిళనాడులోని దిండిగల్‌లో గల ఏఆర్ డెయిరీ యాజమాన్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ తన దర్యాప్తు మొదలు పెట్టింది. మూడో రోజు విచారణలో భాగంగా తిరుమలలో గల టీటీడీకి చెందిన ఫ్లోర్ మిల్, ల్యాబొరేటరీ, మార్కెటింగ్ కార్యాలయం, శ్రీవారి పోటును అధికారులు తనిఖీ చేశారు. నెయ్యి నమూనాలను సేకరించారు.మళ్లీ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఆ తరువాత వెలువడే ఉత్తర్వుల మేరకు సిట్ నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు. ఇదే విషయాన్ని ద్వారకా తిరుమల రావు కూడా ధృవీకరించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కేపు విచారణ దశలో ఉండటం వల్ల 3వ తేదీ వరకు దర్యాప్తు నిలిపివేయాలని నిర్ణయించారని చెబుతున్నారు.
అయితే కలియుగ దైవం మీద ఏ ఆధారం లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారు అంటూ జాతీయ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. దాంతో పాటు సమాంతరంగా సోషల్ మీడియాలో బాబు దేవుడికి హిందూ భక్తులకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైన కూడా మొన్నటి వరకు వైసీపీ మెడకి కత్తిలా ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. దీనిని ప్రభుత్వం ఎలా సాల్వ్ చేసుకుంటుందో చూడాలి.