Chandrababu : చంద్రబాబు ఇప్పుడు నాలుగోసారి ఏపీకి సీఎం అయ్యారు. విద్యార్థిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఉద్ధండులతో కలిసి రాజకీయాలు చేశారు. 40 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు దాటారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్ర విభజన జరిగాక ఒకసారి కలిపి మొత్తం మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన చరిత్ర ఆయనది. నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన లేని రాజకీయాలు లేవు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన సాగించారు. స్మార్ట్ గవర్నెన్స్, ఐటీ, ప్రజల వద్దకే పాలన, జన్మభూమిలాంటి కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఉమ్మడి రాష్ట్రానికి అధునాతన సాగు విధానాలు పరిచయం చేశారు.
అయితే నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి అందుకున్న చంద్రబాబు గతంలో కన్నా భిన్నంగా రూల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వైసీపీ పాలనలో అంత ఏకపక్ష పాలన సాగగా, దానిపై దారుణమైన విమర్శలు వచ్చాయి. మంత్రులకి సొంత నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉండేది కాదని, చిన్నపాటి బదిలీల విషయంలో కూడా వారి ప్రమేయం కూడా తక్కువగా ఉండేదట. దాంతో పాలనలో కూడా కొంత లోపాలు కనిపించేవి. అయితే తన ప్రభుత్వంలో మంత్రులు అలా ఉండకూడదని భావించిన చంద్రబాబు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం వారికి ఇచ్చారట. ఏ నిర్ణయం అయిన ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారట.
ప్రతీ చిన్న విషయాన్ని తన దృష్టికి తీసుకుని రావాల్సిన అవసరం లేదని, ఖజానకు భారం కాని విషయాలకి సంబంధించిన నిర్ణయాలు మంత్రులే చొరవగా నిర్ణయాలు తీసుకుని జనాలకు మేలు చేయవచ్చుఅంటూ మంత్రులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సారి మంత్రులలో అంతా కూడా కొత్త వారే కనిపిస్తున్నారు. వారు చాలా ఉత్సాహంగా పని చేయనున్నారని బాబు విశ్వసిస్తున్నారు. రానున్న రోజులలో ఏపీ రూపు రేఖలు మార్చాలని చంద్రబాబు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.