Small Saving Schemes : కేంద్రంలో ఎన్డ్ఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అని ప్రజలు భావిస్తున్నారు. మోడీ 3.0 ప్రభుత్వంపై ఎన్నో అంచనాలైతే ఉన్నాయి. వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో పన్ను ప్రయోజనాలతో పాటుగా, చిన్నపాటి పొదుపు పథకాలపై కూడా వడ్డీరేట్లు పెరుగుతాయి అని ఆశిస్తున్నారు. అయితే ఈ నెల ఆఖరులో ప్రభుత్వం వడ్డీ రేట్లు ప్రకటించడం జరుగుతుంది. అయితే తరువాత వచ్చే త్రైమాసికంలో ఈ పథకాలకు సంబంధించిన వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. రికరింగ్ డిపాజిట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్,సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమృద్ధి సేవింగ్స్ సర్టిఫికెట్,సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లాంటి ఇతర పథకాలపై కూడా రిటర్న్స్ పెరుగుతాయి అని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అలాగే ప్రతి త్రైమాసికం లో కూడా ఈ చిన్న పాటి పొదుపు పథకాల పై వడ్డీ రేట్ల ను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంతకు ముందు ఏప్రిల్ మరియు జూన్ త్రైమాసికానికి ప్రభుత్వం చిన్న మొత్తం పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచకుండా అలాగే ఉంచింది…
అక్యుబ్ వెంచర్స్ డైరెక్టర్ ఆసిస్ అగర్వాల్ ఫైనాన్షియల్ ప్లాట్ ఫామ్ లైవ్ మింట్ తో మాట్లాడుతూ,వడ్డీ రేటు పెంచడం వలన ప్రజలు ఎక్కువ ఆదాయం పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది అని అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా పొదుపు చేయటం లేదు అని కూడా అన్నారు. అంతే ఈ మార్పుతో వచ్చే ఎక్కువ వడ్డీ చెల్లింపులను కూడా ప్రభుత్వం మేనేజ్ చేయాల్సి ఉంటుంది అని తెలిపారు. ట్రెజరీ పై అధిక ఒత్తిడి లేకుండా పొదుపు చేయించడానికి దీర్ఘకాలిక పెట్టుబడులను కూడా రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఈ విధానాన్ని వాడుకోవాలి అని అగర్వాల్ తెలిపారు. అలాగే విభవంగల్ అనుకూలక ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మౌర్య మాట్లాడుతూ, PF, ESAF లాంటి చిన్న పాటి పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లు కు సంబంధించి ప్రభుత్వం రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటుంది అని అభిప్రాయపడ్డారు. అయితే ఈ వడ్డీ రేట్లను పెంచడం వలన ద్రవ్యోల్బన పరిస్థితులలో లక్షలాది మంది చిన్నపాటి పొదుపు కట్టేవారికి ఎంతో హెల్ప్ అవుతుంది అని తెలిపారు. అయితే ఇది ప్రభుత్వ వ్యయన్ని కూడా పెంచుతుంది, అని అధిక ద్రవ్య లోటుకు దారి తీయవచ్చు అని తెలిపారు. ఈ వడ్డీ రేట్లు పెంచే ముందు ఆర్బిఐ ద్రవ్య విధానం బ్యాంక్ డిపాజిట్ రేట్లు సహా విస్తృత ఆర్థిక ప్రభావాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని అన్నారు. ప్రజలు తమ డబ్బును బ్యాంకు డిపాజిట్ల నుండి బయటకు గనక తీసినట్లైతే, అది రుణ మార్కెట్ కు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై 7.1% వడ్డీ అనేది వస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై 8.2%, సుకన్య సమృద్ధి పథకం కింద చేసినటువంటి డిపాజిట్లపై కూడా 8.2% వడ్డీ అనేది లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పై ప్రభుత్వం 7.7% ఆదాయం అనేది ఇస్తుంది. అయితే ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద 7.4% వడ్డీ రేటు ప్రభుత్వం ఆఫర్ చేస్తున్నది. కిసాన్ వికాస్ పత్ర 7.5% వడ్డీ రేటుఇవ్వనుంది. అయితే1- ఇయర్ డిపాజిట్ స్కీమ్ 6.9%. 2- ఇయర్ డిపాజిట్ పై 7.0%. 3- ఇయర్ డిపాజిట్ పై 7.1% వడ్డీ అనేది లభిస్తుంది. అయితే 5- ఇయర్ డిపాజిట్ పై అధికంగా 7.5 % ఆదాయం అనేది వస్తుంది. అలాగే 5- ఇయర్ రికరింగ్ డిపాజిట్ పథకంపై ఇప్పుడు 6.7% వడ్డీ రేటు ఇస్తుంది…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.