MGNREGA Bills : అకౌంట్లలో డబ్బు జమ చేసి వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చంద్రబాబు
Chandrababu gives a shocking shock to YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్యలో చేపట్టిన పనులకు సంబంధించి గ్రామీణ శ్రామికులు, చిన్న కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్న చెల్లింపులను ఈ రోజు (ఆగస్టు 23) విడుదల చేయనున్నారు. మొత్తం రూ.145 కోట్లు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ చర్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగిస్తూ, శ్రామికులకు తక్షణ ఉపశమనం అందిస్తుందని భావిస్తున్నారు.

#image_title
టీడీపీ పార్టీ ఆరోపణల ప్రకారం.. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో సాంకేతిక కారణాలను చూపుతూ దాదాపు 3.54 లక్షల పనులను క్లోజ్ చేసి, బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు. ఈ కారణంగా గ్రామీణ కార్మికులు, చిన్న కాంట్రాక్టర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఫలితంగా, క్లోజ్ చేసిన 5.54 లక్షల పనులను మళ్లీ ఆన్‌గోయింగ్ వర్కులుగా మార్చి, రూ.179.38 కోట్ల బిల్లుల చెల్లింపుకు మార్గం సుగమం చేసింది.
ఈ చెల్లింపుల్లో భాగంగా మొదటి విడతగా రూ.145 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. మిగిలిన బిల్లులు సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం రెండు పూటలా ఫోటోలు అప్‌లోడ్ చేయాలని, వాటిని అధికారులు వెంటనే పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఈ చర్యలు గ్రామీణ ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా చిన్న కాంట్రాక్టర్లకు ఆర్థికంగా గణనీయమైన సహాయం అందిస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.