Chandrababu : శుభవార్త.. మరో కీలక హామీని నెరవేర్చేందుకు సిద్దమైన ఏపీ సర్కార్..!
ప్రధానాంశాలు:
నిరుపేదలకు చంద్రబాబు శుభవార్త
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో వేగం పెంచింది. ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేదలకు స్థలాల పంపిణీ విషయంలో కీలక అడుగులు వేస్తోంది. గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు చొప్పున స్థలాలు మంజూరు చేయనున్నట్లు తెలుపుతూ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే గ్రామాలలో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటుండగా, తాజాగా శనివారం నుంచి ఆన్‌లైన్ విధానాన్ని కూడా ప్రారంభించారు. దీంతో అర్హులైన వారందరికీ ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు.

Chandrababu : శుభవార్త.. మరో కీలక హామీని నెరవేర్చేందుకు సిద్దమైన ఏపీ సర్కార్..!
Chandrababu ఏపీలో మరో కీలక హామీ అమలుకు కసరత్తు..
ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు తమ ఆధార్, రేషన్ కార్డులు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు గ్రామ సచివాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. సచివాలయం సిబ్బందికి వివరాలు అందించి దరఖాస్తు నమోదు చేయాల్సి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేసిన స్థలాల్లో చాలామంది ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టకపోవడంతో, ఈసారి ప్రభుత్వం మరింత పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో, గతంలో స్థలాలు పొందినవారికి, కానీ ఇల్లు నిర్మించని లబ్ధిదారులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసే యోచనలో ఉంది.
అవసరమైతే కొత్త భూములను సేకరించి మరింత మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల కోసం కూడా ముఖ్య నిర్ణయం తీసుకుంది. వచ్చే సంక్రాంతి నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు చేయిస్తామని టిడ్కో చైర్మన్ ఇటీవల వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలతో ఇళ్ల కల నెరవేరబోతుందన్న ఆశ కలుగుతోంది. దీనివల్ల లక్షలాది గృహనిర్హిత కుటుంబాలకు చక్కటి నివాస సదుపాయం లభించే అవకాశముంది.