Big Breaking : చంద్రబాబుకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది.. ఇప్పట్లో జైలుకు రాలేడు.. కోర్టుకు తెలిపిన లాయర్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Big Breaking : చంద్రబాబుకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది.. ఇప్పట్లో జైలుకు రాలేడు.. కోర్టుకు తెలిపిన లాయర్లు

 Authored By kranthi | The Telugu News | Updated on :15 November 2023,4:17 pm

ప్రధానాంశాలు:

  •  గుండె సమస్యతో పాటు చంద్రబాబును బాధిస్తున్న మధుమేహం

  •  పెరిగిన చంద్రబాబు గుండె పరిమాణం

  •  చంద్రబాబు మళ్లీ కోర్టుకు సరెండర్ కావాల్సిందేనా?

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు గుండె సమస్య ఉందని.. ఆయన ఇప్పట్లో కోర్టుకు వచ్చే అవకాశం లేదని.. ఆయనకు రోజురోజుకూ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని చంద్రబాబు తరుపు లాయర్లు ఏపీ హైకోర్టుకు నివేదించారు. రెండు నెలల కింద ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ఆ తర్వాత రాజమండ్రి జైలులో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు ఉన్న అనారోగ్యం దృష్ట్యా ట్రీట్ మెంట్ తీసుకోవడం కోసం బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా ఏపీ హైకోర్టు కేవలం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆయన కోర్టుకు సరెండర్ కావాలని చెప్పింది. ఇటీవలే చంద్రబాబు కుడికన్నుకు శస్త్ర చికిత్స చేశారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

ఇంతలో చంద్రబాబుకు మరో సమస్య ఎదురైంది. ఆయన గుండె సమస్యతో బాధపడుతున్నారు. ఆయన గుండె పరిమాణం పెరిగింది. దీంతో గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో సమస్య ఏర్పడింది. అందుకే దానికి సంబంధించిన చికిత్స తీసుకోకపోతే చంద్రబాబు ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు తగిన విశ్రాంతి తీసుకోవాలి. గుండెకు సంబంధించిన ట్రీట్ మెంట్ ను టైమ్ టు టైమ్ తీసుకోవాలి.. అని డాక్టర్లు సూచించడంతో అదే విషయాన్ని చంద్రబాబు తరుపు లాయర్లు కోర్టుకు విన్నవించారు. మరో పది రోజుల్లో చంద్రబాబు కోర్టుకు సరెండర్ కావాల్సి ఉంది. ఈనేపథ్యంలో ఆయన హెల్త్ కండిషన్ పై కోర్టుకు లాయర్లు నివేదిక సమర్పించారు. ఆయనకు కంటి సమస్యతో పాటు గుండె సమస్య కూడా ఉందని.. అలాగే.. మధుమేహం కూడా ఆయన్ను బాధిస్తోందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు కంటి సర్జరీ తర్వాత ఇంటి వద్దనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఏపీ హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది