Chandrababu : ఏపీలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. బాబు అర్ధం పరమార్ధం అదేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : ఏపీలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. బాబు అర్ధం పరమార్ధం అదేనా..?

 Authored By ramu | The Telugu News | Updated on :12 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : ఏపీలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. బాబు అర్ధం పరమార్ధం అదేనా..?

Chandrababu : ఏపీలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిసారి చెబుతున్నారు. వైసీపీని గద్దె దింపడం కోసం జనసేన, బీజేపీతో కలిసి టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఐతే టీడీపీ ఒంటరిగా చేసుంటే ఫలితం ఎలా ఉండేదో కానీ కూటమికి మంచి ఆధ్యక్యత వచ్చింది. ఐతే తోడుగా వచ్చిన జనసేన కూడా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చికోవడంతో ఇదంతా వారి ఎఫెక్ట్ అనుకున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ బాగా ఉంది. టీడీపీ, జనసేనకు సపోర్ట్ గా బీజేపీ కూడా ఏపీలో అధికారం చేపట్టేందుకు కృషి చేసింది. ఇదిలాఉంటే ఏపీలో బాబు ఏ మీటింగ్ పెట్టినా సరే ఇక్కడ ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని గుర్తు చేస్తున్నారు. దీని వెనుక రీజన్ ఏపీలో ఉన్న సమస్యలే అని తెలుస్తుంది.

Chandrababu ఐదేళ్లుగా వెనకపడ్డ ఏపీ

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తుంది. ఐతే ఈసారి కేంద్రంలో కూడా కీలకంగా మారడంతో ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత కూడా బీజేపీ కి ఇచ్చినట్టు తెలుస్తుంది. స్పెషల్ స్టేటస్ సంగతి ఏమో కానీ ఏపీ అభివృద్ధికి కావాల్సిన ఆర్ధిక అవసరాలకు కేంద్రం సపోర్ట్ చేసేలా పావులు కదిలిస్తున్నారు. క్యాపిటల్ గా అమరావతికి పెట్టుబడులు తీసుకు రావడం, రోడ్లు బాగు చేయడం, పోలవరం ప్రాజెక్ట్ ఇలా అన్నిట్లో ఏపీ వెనకపడి ఉంది. దీన్ని బాగు చేయాలంటే సరైన ఆర్ధిక వెసులుబాటు అవసరం.

Chandrababu ఏపీలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాబు అర్ధం పరమార్ధం అదేనా

Chandrababu : ఏపీలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. బాబు అర్ధం పరమార్ధం అదేనా..?

అందుకే బాబు ఇక్కడ ఉంది కేవలం టీడీపీ ప్రభుత్వమే కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని పదే పదే చెబుతున్నారు. ఎందుకంటే ఏపీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రం తీసుకోవాలని అలా చెబుతున్నారు. అంతేకాదు ఇదివరకు సీఎం గా చేసినప్పుడు ఎంతో హుషారుగా కనిపించే బాబు ఇప్పుడు ఏపీ పరిస్థితి చూసి చాలా ఆందోళన చెందుతున్నారు. ఐతే ఏపీకి కేంద్రం సపోర్ట్ ఉంటేనే ఏమైనా చేయగలం అనే ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఏపీలో ఉందని పదే పదే గుర్తు చేస్తున్నారు చంద్రబాబు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది