Ambati Rambabu : జైల్లో ఉన్నాడు ఏం పీకుతాడులే అనుకున్న కూటమి కి బిగ్ షాక్ ఇచ్చిన అంబటి రాంబాబు
ప్రధానాంశాలు:
జైల్లో ఉన్నాడు ఏం పీకుతాడులే అనుకున్న కూటమి కి బిగ్ షాక్ ఇచ్చిన అంబటి రాంబాబు
Ambati Rambabu : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టై, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటిని చూసి.. ఇక ఆయన కథ ముగిసిందని, జైల్లో ఉండి ఏం చేస్తారులే అని కూటమి నేతలు భావించారు. కానీ, అనూహ్యంగా ఆయనకు న్యాయస్థానాల్లో వరుస ఊరటలు లభించడం ఇప్పుడు అధికార కూటమికి ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 35 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటినీ కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, ఒకే అంశంపై ఇన్ని కేసులు ఎలా పెడతారని పోలీసులను ప్రశ్నించింది. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం (BNSS 35(3)) నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించింది.
జైల్లో ఉన్నాడు ఏం పీకుతాడులే అనుకున్న కూటమి కి బిగ్ షాక్ ఇచ్చిన అంబటి రాంబాబు
Ambati Rambabu గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో కూడా అంబటికి ఊరట
అంటే, ఈ 35 కేసుల్లో ఆయనను అరెస్టు చేయకుండా హైకోర్టు రక్షణ కల్పించిందని చెప్పుకోవచ్చు. మరోవైపు, గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో కూడా అంబటికి ఊరట దక్కింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు, అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఒక్క రోజులోనే అటు హైకోర్టు నుంచి, ఇటు గుంటూరు కోర్టు నుంచి భారీ ఊరటలు రావడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
అయితే, గత ఏడాది పట్టాభిపురం పీఎస్‌లో నమోదైన పాత కేసులో రిమాండ్ ఉండటంతో ఆయన ప్రస్తుతానికి జైల్లోనే ఉండాల్సి వస్తోంది. అయినప్పటికీ, కూటమి సర్కార్ పెట్టిన వరుస కేసుల గండం నుంచి ఆయన గట్టెక్కడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. “జైల్లో పెట్టి అణచివేయాలనుకున్నారు కానీ, న్యాయమే గెలిచింది” అంటూ అంబటి మద్దతుదారులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే, అంబటి రాంబాబు రాజకీయంగా మరింత దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది.