Chandrababu : చిరంజీవికి చంద్రబాబు కీలక హోదా అందించబోతున్నారా..!
Chandrababu : ఇటీవల ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వరద బాధితుల సహాయార్థం సినీ పరిశ్రమతో పాటు పలువురు ప్రముఖులు సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు వ్యాపారులు సైతం తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి శనివారం కలిశారు. ఈ క్రమంలో ఆయనకు సీఎం సాదర స్వాగతం పలికారు. సీఎం సహాయ నిధికి తన తరఫున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరఫున రూ.50 లక్షల చెక్కులను విరాళంగా అందించారు. విపత్కర సమయంలో సహాయం అందించిన చిరంజీవికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి… వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై ధన్యవాదాలు తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.విరాళం చెక్కులు అందించేందుకు తన నివాసానికి వచ్చిన చిరంజీవికి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. కాసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. అనంతరం కారు వరకూ వెళ్లి చిరంజీవికి వీడ్కోలు పలికారు సీఎం చంద్రబాబు నాయుడు. కాగా, ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమవంతుగా సాయం అందించిన విషయం తెలిసిందే.
Chandrababu : చిరంజీవికి చంద్రబాబు కీలక హోదా అందించబోతున్నారా..!
ఈ మీటింగ్‌లోఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి వ్యవహరించాలని చంద్రబాబు కోరుకుంటున్నారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. అదే సమయంలో చిరంజీవికి హోదా పరంగా పూర్తి ప్రాధాన్యత ఉండేలా ఆలోచన చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో చిరంజీవి కేంద్రంలో టూరిజం శాఖ సహాయ మంత్రిగా పని చేసారు. ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి వ్యవహరించాలని చంద్రబాబు కోరుకుంటున్నారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. అదే సమయంలో చిరంజీవికి హోదా పరంగా పూర్తి ప్రాధాన్యత ఉండేలా ఆలోచన చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర ముఖ్యులతోనూ సత్సంబంధాలు కలిగిన చిరంజీవి సేవలు వినియోగించుకుంటే ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందు కోసం చిరంజీవికి తగిన హోదా ఇవ్వటం ద్వారా భవిష్యత్ రాజకీయాలకు ఉపయోగం ఉంటుందనే చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్టు టాక్. దీనిపై క్లారిటటీ రావలసి ఉంది.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.