Home » Andhra Pradesh » Chandrababu Naidu Best Efforts Wont Secure Special Status
andhra pradesh

Special Status : ప్ర‌త్యేక హోదా ర‌చ్చ‌.. బీహార్‌కి నో చెప్పిన కేంద్రం.. చంద్ర‌బాబు సాధిస్తాడా..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 23, 2024, 3:00 pm
Advertisement

Special Status : ఏపీ ప్రత్యేక హోదా అంశంపై మళ్లీ రాజకీయ మంటలు రగులుతున్నాయి. ఢిల్లీ వేదికగా టీడీపీ, వైసీపీ మధ్య స్పెషల్‌ స్టేటస్‌ ఫైట్‌ నడుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ.. ప్రత్యేక హోదాపై మాట్లడడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే.. తమ ముందు చాలా అంశాలు ఉన్నాయని.. వాటన్నింటిపైనా పార్లమెంట్‌లో మాట్లాడతామంటూ టీడీపీ కౌంటర్‌ ఇవ్వడం కాకరేపుతోంది. తాజాగా పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది.

Advertisement

Special Status ఏపీకి క‌ష్ట‌మే..

పార్లమెంట్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రణాళిక సహాయం కోసం.. గతంలో నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ -ఎన్‌డీసీ ద్వారా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా మంజూరు చేశారు. ప్రత్యేక కేటగిరీ ప్రకటించేందుకు అనేక కారణాలు, అవసరాల ఆధారంగా వర్గీకరించారు. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. బీహార్ రాష్ట్ర పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎన్డీఏలో చక్రం తిప్పవచ్చని.. తమ డిమాండ్లు కేంద్రం వద్ద నుంచి సాధించవచ్చని ఇన్ని రోజులు భావించిన నితీష్ కుమార్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కేంద్ర ప్రభుత్వం.. బీహార్‌కు ప్రత్యేక హోదా లేదని తేల్చేయడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బిహార్ మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ కూడా ప్రత్యేక హోదాను కోరుకుంటోంది.

Special Status : ప్ర‌త్యేక హోదా ర‌చ్చ‌.. బీహార్‌కి నో చెప్పిన కేంద్రం.. చంద్ర‌బాబు సాధిస్తాడా..!

Advertisement

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ గతంలో పోటాపోటీ హామీలిచ్చి ఎన్నికల్లో లబ్ది పొందాయి తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు ప్రత్యేక హోదా సాధన హమీ ఇవ్వకున్నా టిడిపి అత్యధిక ఎంపీలను గెలవడం… కేంద్ర ప్రభుత్వమే ఈ పార్టీపై ఆధారపడటంతో ప్రత్యేక హోదాపై ఆశలు చిగురించాయి. కానీ ఆ ఆశలను మోదీ సర్కార్ ఆదిలోనే తుంచేసింది. సేమ్ టిడిపి లాగే ఎన్డిఏలో జేడియూ కూడా కీలక భాగస్వామి… కాబట్టి ఆ రాష్ట్రానికి నో చెప్పారు కాబట్టి ఏపికి కూడా నో చెప్పినట్లే. చంద్ర‌బాబు ఎన్నికల సమయంలో ఈ ప్రస్తావనే తీసుకురాలేదు. ఇక ఎన్నికల్లో విజయం తర్వాత కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. కేంద్ర నుండి నిధులు తీసుకువస్తామని, పోలవరం నిర్మాణానికి సహాయం వంటి విషయాల గురించి మాట్లాడారు కానీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదు. దీన్నిబట్టే ఆయన ప్రత్యేక హోదా అసాధ్యమని ముందే గ్రహించినట్లు అర్థమవుతోంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి