TDP : కేంద్ర బ‌డ్జెట్‌పై టీడీపీ నేత‌ల ప్ర‌శంస‌లు.. చంద్ర‌బాబు కృషి ఫ‌లించిందంటూ కామెంట్..!

TDP : కొద్ది సేప‌టి క్రితం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ బ‌డ్జెట్ మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి అనుకూలంగా ఉంది. అయితే ఈ బ‌డ్జెట్‌లో ఏపీకి కూడా కొంత ప్ర‌యోజ‌నాలు చేకూరాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం శుభ పరిణామం. ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు నిధులిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతుందని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు.. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కేంద్రం ప్రకటన ఆర్థిక తోడ్పాటు ఇస్తుంది.. ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ఏపీలో పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సాధ్యపడుతుంది.

TDP ఫ‌లితం వ‌చ్చింది..

కేంద్ర బడ్జెట్ కేటాయింపులతో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయి. స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు పడడానికి కేంద్ర బడ్జెట్ ఉపకరిస్తుంది. ఏపీ ఏం ఆశించిందో వాటిని కేంద్రం బడ్జెట్‌లో పొందుపర్చడం సంతోషదాయకమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెట్టించవచ్చని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఫలించాయి. ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర పథకాలు చాలా ఉపయోగంగా ఉంటాయి.. గత ఐదేళ్లల్లో జగన్ రుణాలే తెచ్చారు.. మేం నిధులు తెస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అమరావతిని, పోలవరం ప్రాజెక్టును నాశనం చేస్తే మేం రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ పనులను గాడిలో పెడుతున్నామని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.

TDP : కేంద్ర బ‌డ్జెట్‌పై టీడీపీ నేత‌ల ప్ర‌శంస‌లు.. చంద్ర‌బాబు కృషి ఫ‌లించిందంటూ కామెంట్..!

ఇక ప్ర‌ధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు .జ‌ కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించడం పట్ల కూడా వారు హర్షం వ్య‌క్తం చేశారు.

Recent Posts

Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!

Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…

2 minutes ago

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…

1 hour ago

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…

2 hours ago

OTT : ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌ OTT లో ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ స్ట్రీమింగ్..!

OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…

10 hours ago

Bakasura Restaurant Movie : యమలీల, ఘటోత్కచుడులా తరహాలొ మా మూవీ బకాసుర రెస్టారెంట్ ఉంటుంది : ఎస్‌జే శివ

Bakasura Restaurant Movie  : ''బకాసుర రెస్టారెంట్‌' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌. ఇంతకు ముందు వచ్చిన…

11 hours ago

V Prakash : జగదీష్ రెడ్డి కేసీఆర్ గారితో ఉద్యమంలో ఉన్న‌ప్పుడు క‌విత నువ్వు ఎక్క‌డ ఉన్నావ్‌.. వి ప్రకాష్

V Prakash  : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…

12 hours ago

Tribanadhari Barbarik Movie : చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా త్రిబాణధారి బార్బరిక్ మూవీ విడుద‌ల‌

Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…

12 hours ago

Ys Jagan : చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం : వైఎస్‌ జగన్

Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…

13 hours ago