Chandrababu Naidu : టీడీపీ చేపట్టిన ‘ రా కదలిరా ‘ కార్యక్రమం ముగింపు సభ అనంతపురం జిల్లాలోని పెనుకొండలో జరిగింది. కియా పరిశ్రమ ఎదుట ఏర్పాటు చేసిన ఈ సభకు అనంతపురం, సత్యసాయి జిల్లాల నుంచి టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పై విమర్శలు గుప్పించారు. అలాగే తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తాము అన్నదానిపై కూడా హామీ ఇచ్చారు. పేరూరు ఎత్తిపోతలను పూర్తి చేసి అందిస్తామని, డ్రిప్ స్ప్రింగ్లర్లకు సబ్సిడీని 90 శాతంతో మునుపటిలాగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులకు సోలార్ పంపుసెట్లు అందజేసి విద్యుత్ కు ఖర్చు లేకుండా చేస్తామని రాయలసీమ ప్రాంతాలలో సాగునీటికి ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీ అని గుర్తు చేశారు. గొల్లపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లు పూర్తి చేస్తామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఇటీవల రాప్తాడు జరిగిన సిద్ధం సభలోనైనా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏమి చేశారన్నది చెప్పలేదని విమర్శించారు.
టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సాగునీటి కోసం 64 వేల కోట్లు ఖర్చు పెట్టిందని అన్నారు. భవిష్యత్తులోనూ సంక్షేమంలో కోతలు లేకుండా ప్రజలకు అందిస్తామని అన్నారు. ప్రస్తుతం ఉపాధి కోసం బెంగళూరు ఇతర ప్రాంతాలకు వెళితే వెంటనే పెన్షన్లు తొలగిస్తున్నారని, అలా కాకుండా మూడు మాసాలైనా తొలగించకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలు అన్నీ ఇన్ని కావని, ఒక్కో ఎమ్మెల్యే గురించి చంద్రబాబు వివరించారు. వీరు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారని, కొంతమందిని వేరే ప్రాంతాలకు బదిలీ చేశారని తెలిపారు. నియోజకవర్గం మారితే ఇక్కడ చెత్తగా ఉన్నది అక్కడ స్వర్ణమవుతుందా అని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించాలని, అందుకోసం ఈ 40 రోజులు అందరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.
రా కదలిరా సభ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యే పేరు చెబుతూ వారి అవినీతి అక్రమాలను ఎండగట్టారు. పెనుకొండ శంకర్ నారాయణ పెద్ద ఎత్తున అవినీతి చేశారని అన్నారు. రాప్తాడులో తోపుదుర్తి అరాచకాలు అన్నారు. అక్కడ లేఅవుట్ వేయాలన్న కపం కట్టాల్సిందే అన్నారు. రైతు భూమి అమ్మలేదని మామిడి చెట్లు నరికించిన సంస్కృతి తోపుదుర్తిది అని అన్నారు. ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి లక్ష్మీనరసింహస్వామిని కూడా వదల్లేదన్నారు. ఇలా ఒక్కో ఎమ్మెల్యే గురించి చెబుతూ వచ్చే ఎన్నికల్లో వారిని ఓడించాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.