Tirumala Laddu : జగన్ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారంటూ చంద్రబాబు మండిపడ్డారు. భక్తుల మనోభావాలకు విలువ లేకుండా చేశారన్నారు. స్వామి వారంటే నమ్మకం లేని వారిని అక్కడ ఛైర్మెన్లుగా పెట్టారని, టీటీడీ బోర్డు అనేది రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. తిరుమలను అన్ని విధాలుగా అపవిత్రం చేశారన్నారు. 5 ఏళ్లలో తిరుమల లడ్డూ ఎలా ఉండేదో అందరికీ తెలుసని, మూడు రోజుల్లో లడ్డూ చెడి పోవటం, సువాసన లేకపోవటం, రంగు కూడా తేడాగా ఉండటం, ఇవన్నీ అందరికీ తెలిసిందే అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే పోరాటం చేశామన్నారు.చిన్నప్పటి నుంచి తిరుమల శ్రీవారిపై ఎంతో విశ్వాసముందని, అలిపిరి ఘటనలో ప్రాణాలతో బయటపడటమే స్వామివారి కృప అని తెలిపారు. ఆ బ్లాస్ట్‌లో ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని అన్నారు.తిరుమల స్వామి వారి మహత్యం గురించి చంద్రబాబు మాట్లాడుతూ, భక్తుల అకౌంట్లను స్వామి ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తారని అన్నారు.గత ఐదేళ్లలో భక్తుల మనోభావాలు, సమస్యలకు విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉపయోగించారని,అది ప్రజల మనోభావాలను దెబ్బతీశిందని ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం శ్రీవారిని కూడా వదల్లేదని,లడ్డూ నాణ్యతను రివర్స్ టెండరింగ్ ద్వారా క్షీణతకు గురి చేసారని విమర్శించారు.
నేను ప్రమాణస్వీకారం చేస్తూనే, టీటీడీ ఈవోని అపాయింట్ చేసి, తిరుమల ప్రక్షాళన మొదలు పెట్టాలని ఆదేశించాను. ఆయన పని మొదలుపెట్టారు. నాసిరకం నెయ్యి పంపిస్తున్నారని డౌట్ వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినా వినలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో, తిరుమల కొండపై కూడా కక్కుర్తి పడ్డారు. తమ వారికి ఇచ్చుకోవటానికి, కమిషన్ల కక్కుర్తి కోసం, మొత్తం నిబంధనలు మార్చేశారు. చివరకు నెయ్యి ఉత్పత్తి సామర్ధ్యం లేని వారు కూడా టెండర్ లో పాల్గొనవచ్చని నిబంధనలు మార్చేశారు.ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ లేదా ఆపైస్థాయి అధికారితో సిట్ వేస్తాం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మొత్తం వ్యవహారంపై దర్యాఫ్తు చేస్తుంది. జరిగిన అపవిత్రం, అధికార దుర్వినియోగం ఇవన్నీ అనలైజ్ చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్టు ఇస్తారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. తద్వారా భవిష్యత్తుల్లో ఇలాంటివి జరక్కుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని చంద్రబాబు అన్నారు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.