Makhana Chivda : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే వీటితో కూరలు మరియు స్నాక్స్ ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకొని మరీ తింటారు. వీటితో చేసిన రెసిపీలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవటం వలన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు దొరుకుతాయి. అలాగే వీటిని తినడం వలన దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అయితే ఎంతో ఆరోగ్యకరమైన మఖానాతో పిల్లలు ఎంతో ఇష్టపడి తినేలా ఓ హెల్దీ స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని సాధారణంగా చిడ్వా లేక చివ్ డా ను అటుకులతో ప్రిపేర్ చేస్తారు. కానీ ఫుల్ మఖానా తో చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. వీటిని చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. మరి దానిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం…
ఫుల్ మఖాన చిడ్వాకి కావలసిన పదార్థాలు : పల్లీలు, ఫుల్ మఖాన, ఎండుమిర్చి,కొబ్బరి ముక్కలు, కరివేపాకు బాదం,పసుపు, కారం, ఉప్పు, జీడిపప్పు, పుట్నాలు,ఆయిల్,నెయ్యి…
తయారీ విధానం : ముందుగా మనం ఒక కడాయిని తీసుకోవాలి. దీనిలో కొద్దిగా ఆయిల్ మరియు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. వీటిలో కొద్దిగా మఖాన వేసుకొని చిన్న మంటపైన ఫ్రై చేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పు, వేరుశనగలు, బాదంపప్పు ఒక దాని తర్వాత మరొకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత పుట్నాలు, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, ఎండు మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇవి ఎక్కువసేపు మండకుండా చూసుకోవాలి. అలాగే వీటిలో ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేయాలి. మీరు కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. తర్వాత వీటిలో నట్స్ మరియు ముఖాన వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత గాలి కూడా వెళ్లని స్టీలు డబ్బాలో వీటిని స్టోర్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మఖానా చిడ్వా రెడీ అయినట్లే…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.