Tirumala Laddu : తిరుపతి ల‌డ్డూ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు.. సిట్ విచార‌ణ‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tirumala Laddu : తిరుపతి ల‌డ్డూ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు.. సిట్ విచార‌ణ‌..!

Tirumala Laddu : జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారంటూ చంద్ర‌బాబు మండిప‌డ్డారు. భక్తుల మనోభావాలకు విలువ లేకుండా చేశారన్నారు. స్వామి వారంటే నమ్మకం లేని వారిని అక్కడ ఛైర్మెన్లుగా పెట్టారని, టీటీడీ బోర్డు అనేది రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. తిరుమలను అన్ని విధాలుగా అపవిత్రం చేశారన్నారు. 5 ఏళ్లలో తిరుమల లడ్డూ ఎలా […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 September 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Tirumala Laddu : తిరుపతి ల‌డ్డూ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు.. సిట్ విచార‌ణ‌..!

Tirumala Laddu : జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారంటూ చంద్ర‌బాబు మండిప‌డ్డారు. భక్తుల మనోభావాలకు విలువ లేకుండా చేశారన్నారు. స్వామి వారంటే నమ్మకం లేని వారిని అక్కడ ఛైర్మెన్లుగా పెట్టారని, టీటీడీ బోర్డు అనేది రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. తిరుమలను అన్ని విధాలుగా అపవిత్రం చేశారన్నారు. 5 ఏళ్లలో తిరుమల లడ్డూ ఎలా ఉండేదో అందరికీ తెలుసని, మూడు రోజుల్లో లడ్డూ చెడి పోవటం, సువాసన లేకపోవటం, రంగు కూడా తేడాగా ఉండటం, ఇవన్నీ అందరికీ తెలిసిందే అన్నారు.

Tirumala Laddu ప‌విత్ర‌త‌ని కాపాడుతాం..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే పోరాటం చేశామన్నారు.చిన్నప్పటి నుంచి తిరుమల శ్రీవారిపై ఎంతో విశ్వాసముందని, అలిపిరి ఘటనలో ప్రాణాలతో బయటపడటమే స్వామివారి కృప అని తెలిపారు. ఆ బ్లాస్ట్‌లో ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని అన్నారు.తిరుమల స్వామి వారి మహత్యం గురించి చంద్రబాబు మాట్లాడుతూ, భక్తుల అకౌంట్లను స్వామి ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తారని అన్నారు.గత ఐదేళ్లలో భక్తుల మనోభావాలు, సమస్యలకు విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉపయోగించారని,అది ప్రజల మనోభావాలను దెబ్బతీశిందని ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం శ్రీవారిని కూడా వదల్లేదని,లడ్డూ నాణ్యతను రివర్స్ టెండరింగ్ ద్వారా క్షీణతకు గురి చేసారని విమర్శించారు.

Tirumala Laddu తిరుపతి ల‌డ్డూ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు సిట్ విచార‌ణ‌

Tirumala Laddu : తిరుపతి ల‌డ్డూ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు.. సిట్ విచార‌ణ‌..!

నేను ప్రమాణస్వీకారం చేస్తూనే, టీటీడీ ఈవోని అపాయింట్ చేసి, తిరుమల ప్రక్షాళన మొదలు పెట్టాలని ఆదేశించాను. ఆయన పని మొదలుపెట్టారు. నాసిరకం నెయ్యి పంపిస్తున్నారని డౌట్ వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినా వినలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో, తిరుమల కొండపై కూడా కక్కుర్తి పడ్డారు. తమ వారికి ఇచ్చుకోవటానికి, కమిషన్ల కక్కుర్తి కోసం, మొత్తం నిబంధనలు మార్చేశారు. చివరకు నెయ్యి ఉత్పత్తి సామర్ధ్యం లేని వారు కూడా టెండర్ లో పాల్గొనవచ్చని నిబంధనలు మార్చేశారు.ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ లేదా ఆపైస్థాయి అధికారితో సిట్ వేస్తాం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మొత్తం వ్యవహారంపై దర్యాఫ్తు చేస్తుంది. జరిగిన అపవిత్రం, అధికార దుర్వినియోగం ఇవన్నీ అనలైజ్ చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్టు ఇస్తారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. తద్వారా భవిష్యత్తుల్లో ఇలాంటివి జరక్కుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని చంద్ర‌బాబు అన్నారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది