Chandrababu : 2009లో చిరంజీవి పార్టీ అంటూ చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాళ్లు ఏది చెపితే అది ప్రజలు నమ్మాలి..అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. మేము చెప్పిందే మీడియా రాయాలి మేము చెప్పిందే వేదం అన్నట్టు..వైసీపీ వాళ్ల ధోరణి. ఒకవేళ నమ్మకపోతే రాయకపోతే దాడి. ఇలాంటి వారి గురించి ఎలా మాట్లాడుతామండి. ఒకప్పుడు రాజకీయ నేతలు సిగ్గుపడే వాళ్ళు…వీళ్లు మాత్రం.. ఉన్న కొద్ది రెచ్చిపోతున్నారు. ప్రతిపక్షాలు అధికార పార్టీలో ఉన్న నాయకులను తప్పు చేశారు అని ఆరోపణలు […]
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాళ్లు ఏది చెపితే అది ప్రజలు నమ్మాలి..అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. మేము చెప్పిందే మీడియా రాయాలి మేము చెప్పిందే వేదం అన్నట్టు..వైసీపీ వాళ్ల ధోరణి. ఒకవేళ నమ్మకపోతే రాయకపోతే దాడి. ఇలాంటి వారి గురించి ఎలా మాట్లాడుతామండి. ఒకప్పుడు రాజకీయ నేతలు సిగ్గుపడే వాళ్ళు…వీళ్లు మాత్రం.. ఉన్న కొద్ది రెచ్చిపోతున్నారు. ప్రతిపక్షాలు అధికార పార్టీలో ఉన్న నాయకులను తప్పు చేశారు అని ఆరోపణలు చేస్తే అప్పట్లో సిగ్గుపడేవారు.
అదే సమయంలో తగ్గేవారు కానీ ప్రస్తుతం వైసీపీ వాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. పాలకులే స్మగ్లర్స్ అయిన తర్వాత… ప్రభుత్వంలో ఉన్న వారే పోలీసులు అండతో.. దారుణాలు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం లో జరుగుతున్న దాడిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం కనిపించడం లేదు. ఏది ఏమైనా చివర ఆఖరికి ప్రజలు డిసైడ్ చేస్తారు. మీడియాలో సైతం కొంతమంది వాళ్ళకు అనుగుణంగానే వార్తలు రాస్తున్నారు. సినిమాలు గురించి మాట్లాడుతూ తమపై నిందలు వేస్తున్నారు అంటూ చంద్రబాబు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
2009లో చిరంజీవి పార్టీ పెట్టకపోతే నేనే అధికారంలోకి వచ్చేవాడిని. అలాగని నేను చిరంజీవినీ పగవాడిగా ఎంచుకోలేదు. అంతకుముందు నా స్నేహితుడా ఆ తర్వాత కూడా మిత్రుడు గానే భావించాను. రాష్ట్రంలో రాజకీయ నాయకులు సినిమా హీరోలు మాత్రమే కాదు సామాన్యులపై కూడా దాడి చేసే పరిస్థితి ఏర్పడింది.