Chandrababu : టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు.. స్టూడెంట్ గా అదరగొట్టిన లోకేష్.. వీడియో
ప్రధానాంశాలు:
క్లాస్ రూమ్ లో బాబు , లోకేష్ ..క్లాస్ రూమ్ అంత పరేషాన్
Chandrababu : టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు.. స్టూడెంట్ గా అదరగొట్టిన లోకేష్.. వీడియో..!
Chandrababu : ఏపీ ప్రభుత్వం AP Govt School , ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో guru purnima మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో andhra pradesh CM ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు TDP CM Chandrababu కాసేపు ఉపాధ్యాయుడిగా మారారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చొని పాఠాలు విన్నారు.

Chandrababu : టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు.. స్టూడెంట్ గా అదరగొట్టిన లోకేష్
Chandrababu : తండ్రి టీచర్.. కొడుకు స్టూడెంట్ .. చంద్రబాబు , లోకేష్ ల క్లాస్ కు ఫిదా
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు “వనరులు” అనే అంశంపై విద్యార్థులకు క్లాస్ తీసుకోవడం, వారి ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించడం, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడడం విశేష ఆకర్షణగా నిలిచింది. విద్యా రంగాన్ని బలోపేతం చేయాలన్న సంకల్పంతో ఈ సమావేశం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు ఒకే వేదికపై కలుసుకున్నారు. మంత్రి లోకేశ్ విద్యా శాఖలో చేస్తున్న కృషిని సీఎం ప్రశంసించారు. పాఠశాల అభివృద్ధిపై అధికారులకు సూచనలు కూడా చేశారు.
జెడ్పీ పాఠశాల పరిసరాలను విద్యార్థులు తీర్చిదిద్దిన కళారూపాలు, పోస్టర్లు, “తల్లికి వందనం” కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్సీసీ కేడెట్‌లు సీఎంకు గౌరవ వందనం ఇచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఫోటో ఫ్రేమ్‌లలో తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి చిత్రాలు దిగారు. విద్యను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది మరో విశేష అడుగు. చదువు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు స్వాగతిస్తున్నారు.
టీచర్ గా సీఎం చంద్రబాబు.. స్టూడెంట్ గా మంత్రి లోకేష్..
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పిన సీఎం చంద్రబాబు
విద్యార్థులతో కలిసి ఆసక్తిగా క్లాస్ విన్న మంత్రి లోకేష్ pic.twitter.com/Ra2RS52MVD
— BIG TV Breaking News (@bigtvtelugu) July 10, 2025