Chandrababu : సీఎంలో ఏం జ‌రుగుతుంది చంద్ర‌బాబుకి తెలియ‌దా.. అంతా దీని గురించే చ‌ర్చ‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : సీఎంలో ఏం జ‌రుగుతుంది చంద్ర‌బాబుకి తెలియ‌దా.. అంతా దీని గురించే చ‌ర్చ‌..!

Chandrababu చంద్ర‌బాబు ఏపీ అభివృద్ధిపైన ప్ర‌త్యేక దృష్టి పెట్టారు.అనేక కార్యక్ర‌మాల‌లో పాల్గొంటూ ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు.శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేరాలకు పాల్పడేవారికి అదే చివరి రోజు అవుతుందని రౌడీలను హెచ్చరించారు. విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారని… వారంతా ప్రజల హృదయాలలో త్యాగధనులుగా నిలిచిపోయారని చంద్రబాబు అన్నారు. అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో పోలీసులది […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 October 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : సీఎంలో ఏం జ‌రుగుతుంది చంద్ర‌బాబుకి తెలియ‌దా.. అంతా దీని గురించే చ‌ర్చ‌..!

Chandrababu చంద్ర‌బాబు ఏపీ అభివృద్ధిపైన ప్ర‌త్యేక దృష్టి పెట్టారు.అనేక కార్యక్ర‌మాల‌లో పాల్గొంటూ ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు.శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేరాలకు పాల్పడేవారికి అదే చివరి రోజు అవుతుందని రౌడీలను హెచ్చరించారు. విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారని… వారంతా ప్రజల హృదయాలలో త్యాగధనులుగా నిలిచిపోయారని చంద్రబాబు అన్నారు. అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో పోలీసులది కీలక పాత్ర అని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటం కోసం పోలీసులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. పోలీసుల శ్రమను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.

Chandrababu ఏం జ‌రుగుతుంది..!

అలానే రీసెంట్‌గా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మంత్రులతో భేటీ అయ్యారు. ఇసుక, మద్యం విషయాల్లో మీ జోక్యం వద్దని, గత ప్రభుత్వం ఇలాగే నష్టపోయిందని ఎమ్మెల్యేలు ఎంపీలు దూరంగా ఉండాలంటూ చంద్ర‌బాబు వారికి ప‌లు సూచ‌న‌లు చేశారు. అయితే అదే స‌మ‌యంలో ఎమ్మెల్యే, ఎంపీల విన్న‌పాలు ఆయ‌న‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. నాలుగు నెలలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ సీఎం అపాయింట్మెంట్ కానీ మంత్రి నారా లోకేష్ అపాయింట్మెంట్ కానీ దొరకటం లేదని మెజారిటీ ఎమ్మెల్యేలు ఘోల్లున మొరపెట్టుకున్నారు. గత ప్ర‌భుత్వంలో ఇలానే జ‌రిగి ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. తాజాగా టిడిపి కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించటం.. గ‌మ‌నార్హం.

Chandrababu సీఎంలో ఏం జ‌రుగుతుంది చంద్ర‌బాబుకి తెలియ‌దా అంతా దీని గురించే చ‌ర్చ‌

Chandrababu : సీఎంలో ఏం జ‌రుగుతుంది చంద్ర‌బాబుకి తెలియ‌దా.. అంతా దీని గురించే చ‌ర్చ‌..!

గుంటూరుకే చెందిన ఒక ఎమ్మెల్యే పదిసార్లు తాను ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చానని అపాయింట్మెంట్ కోరుతూ నాలుగు సార్లు లేఖలు పెట్టానని ఆధారాలతో సహా చూపించారు. దీంతో ఆశ్చర్యపైన చంద్రబాబు ఏం జరుగుతోందో తాను ఎంక్వైరీ చేస్తాన‌ని అన్నారు. గ‌తంలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన అధిపతి ఇలానే చంద్ర‌బాబు అపాయింట్‌మెంట్ కోసం ప్ర‌య‌త్నించ‌గా, దొరక‌లేదు. దాంతో ఆమె సోష‌ల్ మీడియా ద్వారా విన్న‌వించుకుంటే వెంటనే చంద్రబాబు ఆమెకి సారీ చెప్పి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అయితే సీఎం ఓలో ఏం జరుగుతోందనేది చంద్రబాబుకు తెలుసా,తెలియ‌దా అనేది అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది