Sunil Kanugolu VS Prashanth Kishore : ఏపీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించే బాధ్యత తీసుకున్న సునీల్ కనుగోలు? జగన్ కు షాక్
ప్రధానాంశాలు:
టీడీపీతో జతకట్టబోతున్న సునీల్ కనుగోలు
ఏపీలో టీడీపీ గెలుపు ఖాయమేనా?
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో కీలకంగా ఉన్న సునీల్
Sunil Kanugolu VS Prashanth Kishore : తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఇక.. ఏపీలో ఎన్నికల సమరం ఆరంభం అవుతోంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు విషయంలో కీలకంగా వ్యవహరించింది రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. వాళ్ల వెనుక ఉండి కాంగ్రెస్ గెలుపునకు కారణమైన వ్యూహకర్త సునీల్ కనుగోలు. ఒక ఐదేళ్ల కింద 2019 ఏపీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పేరు ఎంతలా మారుమోగిపోయిందో ఇప్పుడు సునీల్ కనుగోలు పేరు అంతగా మారుమోగుతోంది. దానికి కారణం.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ఒకరకంగా ఆయనే కారణం కావడం. తెలంగాణ మాత్రమే కాదు.. కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు వెనుక వ్యూహకర్తగా సునీల్ ఉన్నాడు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణకు షిఫ్ట్ అయి ఇక్కడ వ్యూహాలు రచించాడు. కాంగ్రెస్ గెలుపునకు కారణం అయ్యాడు. నిజానికి సునీల్ కనుగోలు ఎవరో కాదు.. ప్రశాంత్ కిషోర్ టీమ్ కు చెందిన వ్యక్తే. ప్రశాంత్ కిషోర్ శిష్యుడనే చెప్పుకోవాలి. ఐపాక్ నుంచి బయటికి వచ్చిన సునీల్ తన సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకొని రాజకీయ పార్టీల కోసం పని చేస్తున్నాడు.
2019 ఎన్నికల్లో జగన్ ను గెలిపించడం కోసం ప్రశాంత్ కిషోర్ ఎన్నో అబద్ధాలు చెప్పారని.. ప్రత్యేక హోదా అంశం చూపించి కావాలని ఓట్లు వేయించుకున్నారని చాలా విమర్శలు వచ్చాయి. టీడీపీ కూడా అదే విషయాన్ని ఇప్పటికీ నొక్కి చెబుతుంది. కానీ.. ప్రశాంత్ కిషోర్ కంటే కూడా సునీల్ కనుగోలు అప్రోచ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు సునీల్ కనుగోలును వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం రాబిన్ శర్మ టీమ్ టీడీపీకి పని చేస్తున్నా.. ఆ టీమ్ అంతగా వర్కవుట్ కావడం లేదు. అందుకే రాబిన్ శర్మ టీమ్ ను పక్కన పెట్టి సునీల్ టీమ్ ను లైన్ లోకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Sunil Kanugolu VS Prashanth Kishore : అప్పుడు కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ.. రేపు ఏపీ
మొన్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో సునీల్ కీలకం అయ్యారు. నిన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకం అయ్యారు. రేపు ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం సునీల్ కనుగోలు కీలకం కాబోతున్నారు. చంద్రబాబు కోసం ఆయన పని చేయనున్నారు. చూద్దాం మరి సునీల్ కనుగోలు టీమ్ పనితనం ఏపీలో పని చేస్తుందో లేదో?