Chandrababu : నిద్రపోని చంద్రబాబు.. నేనున్నానంటు వరద బాధితులకు భరోసా..!
Chandrababu : తెలంగాణ, ఏపీలలో కురిసిన భారీ వర్షాలకి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది.బుడమేరు వరద ప్రభావంతో విజయవాడ నీటమునిగింది. సింగ్‌నగర్‌లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సింగ్‌నగర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు భరోసా కల్పించారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు.
చిమ్మచీకట్లో అరగంటకుపైగా బోటులో పర్యటించారు. సెల్‌ఫోన్లు, వీడియో కెమెరా లైట్ల వెలుతురులో ఆ ప్రాంతంలో తిరిగారు. బాధితుల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. ఆదివారం విజయవాడలో పలు ప్రాంతాల్లో బోటులో పర్యటించారు. వరద తీవ్రతను స్వయంగా తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.రాత్రి విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బస చేశారు. తన బస్సును అక్కడే పార్క్ చేశారు. అక్కడే అధికారులతో సమీక్ష చేపట్టారు. వరద తీవ్రత తగ్గేంత వరకూ ఇక్కడే ఉంటానంటూ భరోసా ఇచ్చారు. సహాయక, పునరావాస చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తానని అన్నారు.
Chandrababu : నిద్రపోని చంద్రబాబు.. నేనున్నానంటు వరద బాధితులకు భరోసా..!
ఆదివారం అంతా విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. తెల్లారుజామున రెండు గంటలు మాత్రమే నిద్రపోయారు. మళ్లీ యథావిధిగా రంగంలోకి దిగిన ఆయన వరద సహాయక చర్యలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఓ వైపు ఎన్డీఆర్ఎఫ్, మరోవైపు పవర్ బోట్స్ రావడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. సోమవారం ఉదయం నుంచి కూడా అధికారులను సీఎం పరుగులు పెట్టిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో తాగడానికి నీరు, తినడానికి తిండి లేక వరద బాధితులు అల్లాడుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే.. చంద్రబాబు ఇదివరకే ఆ ప్రాంతంలో పర్యటించినా సరే సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిపోయిన సీబీఎన్.. అధికారులను పరుగులు పెట్టించారు. బాబు రాకతో ఎక్కడికక్కడ అలర్ట్ అయిన ఆఫీసర్లు.. బాధితులకు ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్న పరిస్థితి.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.