Heart : కొన్ని రకాల ప్రధాన అలవాట్లే మీ గుండె పోటు కు దారితిస్తాయి తెలుసా...!
Heart : ప్రస్తుత కాలంలో గుండెకు సంబంధించిన సమస్యల భారీనా పడుతున్న వారి సంఖ్య నానాటికి బాగా పెరిగిపోతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే. కరోనా మహమ్మారి వచ్చి పోయిన తర్వాత గుండె సమస్యలు బాగా తీవ్రమయ్యాయి. పట్టుమని పాతికేళ్ళు కూడా నిండని వారు గుండెపోటు తో మరణించడం అనేది ఎంతో ఆందోళన కలిగిస్తున్నది. అయితే గుండె పనితీరు పై ప్రతికూల ప్రభావం చూపేందుకు ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. అయితే మనం తీసుకునే ఆహారం మరియు మన జీవన శైలిలో మార్పుల కారణంగా గుండె పనితిరు పై ఎంతో ప్రభావం పడుతుంది అని అంటున్నారు. అయితే కొన్ని రకాల ప్రధాన అలవాట్లు గుండెపోటుకు కారణం అవుతున్నాయి అని అంటున్నారు నిపుణులు. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఎలాంటి పరిస్థితుల్లో అయినా వేయించినటువంటి ఆహారాన్ని అధికంగా తీసుకోకూడదు అని అంటున్నారు. అలాగే వీటిలో అధికంగా ఉండే నూనె మరియు కొవ్వు గుండె సిరలలో అడ్డుకుంటుంది. అంతేకాక గుండెపోటు సమస్య పెరిగే అవకాశం కూడా బాగా ఉంటుంది. అలాగే స్పైసీ ఫుడ్ ను కూడా చాలా వరకు తగ్గించుకోవాలి. వీటికి బదులుగా తాజా పండ్లు మరియు కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే గుండెపోటుకు దుమపానం మరియు మద్యం సేవించడం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. వీటి కారణంగా కూడా గుండె పనితీరుపై ఎంతో ప్రభావం పడుతుంది. దీనివలన రక్తపోటు పెరిగి స్ట్రోక్ కు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గుండెపోటు సమస్యకు మరొక ప్రధాన కారణం ఏంటి అంటే ఒత్తిడి. ప్రస్తుత కాలంలో ఒత్తిడితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. సరైన నిద్ర లేకపోవడం మరియు ఒత్తిడితో చిత్తావటం కారణంగా కూడా రక్తపోటుకు దారి తీస్తుందని అంటున్నారు నిపుణులు. ఇవి గుండెపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే రోజులో కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్ర అనేది కచ్చితంగా అవసరం. అంతేకాక యోగ మరియు మెడిటేషన్ లాంటి వాటిని అలవాటు చేసుకుంటే మరీ మంచిది…
Heart : కొన్ని రకాల ప్రధాన అలవాట్లే మీ గుండె పోటు కు దారితిస్తాయి తెలుసా…!
శారీరక శ్రమ లేకపోవడం మరియు వ్యాయమం చేయకపోవడం వలన కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అని అంటున్నారు నిపుణులు. కనీసం రోజుకు 30 నిమిషాలు వాకింగ్ చేయడాన్ని అలవాటు చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చేందుకు మరొక ప్రధాన కారణం ఏంటి అంటే ఉప్పును ఎక్కువగా తీసుకోవడం. దీనిని మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోవడం వలన రక్తపోటు అనేది పెరుగుతుంది. అలాగే సహజంగానే గుండెపై ఒత్తిడి అనేది పెరుగుతుంది. అంతేకాక గుండె సమస్యల ప్రమాదాలను కూడా పెంచుతుంది. అయితే మీ గుండె ఆరోగ్యాంగా ఉండాలి అంటే ఉప్పును చాలా వరకు తగ్గించుకోవాలి. అలాగే ప్యాకేజ్ ఫుడ్ కు కూడా దూరంగా ఉండాలి. అలాగే గుండెపోటు వచ్చేందుకు ఉబకాయం కూడా ఒక ముఖ్య కారణమని చెప్పవచ్చు. గుండె ఆరోగ్యాంగా ఉండాలి అంటే కచ్చితంగా బరువు కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి అని అంటున్నారు నిపుణులు…
విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన విలాసవంతమైన…
Chiranjeevi | అభిమానం హద్దులు దాటి, జీవితాన్నే పణంగా పెట్టి తన అభిమాన నటుడిని కలవాలని పట్టుదలగా ప్రయత్నించిన ఓ మహిళా…
War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…
Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Hansika | స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు హల్చల్ చేస్తున్న…
LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…
Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…
Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్‌లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి,…
This website uses cookies.