Chandrababu : చంద్రబాబు త్వరగా మేలుకో.. లేదంటే పెను ప్రమాదం ముంచుకొస్తుంది..!
ప్రధానాంశాలు:
Chandrababu : చంద్రబాబు త్వరగా మేలుకో.. లేదంటే పెను ప్రమాదం ముంచుకొస్తుంది..!
Chandrababu : ప్రజల వద్దకే పాలన.. ఎంతోమంది రాజకీయ పార్టీల నాయకుల నోటి నుంచి వినే మాట. కొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేసినా.. పెద్దగా ఫలించిన దాఖలాలు లేవు. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు. దీంతో ఏ పని జరగాలన్నా వైట్ కాలర్ ప్రమేయం తప్పనిసరి అయ్యింది. ఆఖరికి ఆదాయ ధ్రువీకరణ పత్రం కావాలన్నా.. లోకల్ లీడర్ దగ్గరకే వెళ్లే పరిస్థితి. అయితే ఆ వ్యవస్థకి జగన్ చెక్ పెట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నెలల వ్యవధిలోనే.. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
Chandrababu చంద్రబాబుకి పెద్ద సమస్యే…
2019 అక్టోబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థలో శాశ్వత ఉద్యోగులతో పాటు.. వాలంటీర్లను నియమించారు. ఒక్కో వాలంటీర్‌కు 50 ఇళ్ల చొప్పున అప్పగించి.. సంక్షేమాన్ని గడప గడపకూ అందించారు. సచివాలయాల వ్యవస్థ ప్రవేశపెట్టి అక్టోబర్ 2వ తేదీ నాటికి ఐదేళ్లు నిండాయి. ఇక వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థని కూడా జగన్ తీసుకొచ్చారు. ఈ రెండు కొంత ఉపయోగంగా ఉండేవి. కాని కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండు అంశాలు ప్రజలకు ఇప్పుడు ఇబ్బందిగా మారాయి.
ప్రజలకు ఏం కావాలన్నా.. గతంలో వైసీపీ హయాంలో చేతిలో వలంటీర్ సంప్రదించేవారు. నల్లా నుండి వ్యక్తిగత సర్టిఫికెట్స్ వరకు ప్రతీది కూడా వాలంటీర్స్‌ని అడిగి తెలుసుకునేవారు. సమస్యలు మరింత ఎక్కువైతే సచివాలయంకి వెళ్లేవాళ్లు. అయితే ఈ రెండు వ్యవస్థలు నాలుగు మాసాలుగా పనిచేయడం లేదు. ప్రస్తుతం కొత్తగా రేషన్ కార్డు కావాలని కోరుకుంటున్న వారు, డెత్, బర్త్ సర్టిఫికెట్లు, విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇలా ఏ అవసరం వచ్చినా.. కలెక్టర్ ఆఫీసులకి పోవలసి వస్తుంది. వాలంటీర్స్ ఉంటే ఇంటికి వచ్చి సమస్యని రెక్టిఫై చేసేవారు. కాని ఇప్పుడు అన్ని పనులు వదులుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. విజయవాడ, విశాఖ సహా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా `వలంటీర్ ఎక్కడా? ఏమయ్యారు? ఏం చేస్తున్నారు` అనే మాటే ఎక్కువగా వినిపిస్తుంది. చంద్రబాబు ఈ విషయంలో త్వరగతిన నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది.