Chandrababu : ఎట్ట‌కేల‌కి బ‌స్సు వీడి ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు… ప‌ది రోజుల పాటు ప్ర‌జ‌ల‌తోనే..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: September 11, 2024, 7:00 pm
  •  Chandrababu : ఎట్ట‌కేల‌కి బ‌స్సు వీడి ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు... ప‌ది రోజుల పాటు ప్ర‌జ‌ల‌తోనే..!

Chandrababu : ఏపీలో వ‌ర‌ద ప్ర‌వాహం ఎంతటి ఉత్ప‌న్నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.అసాధారణ వర్షాలకు బుడమేరుకి గండ్లు పడి విజయవాడ నగరంలోని అనేక కాలనీలను ముంచెత్తింది. లక్షలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.ఈ స‌మయంలో చంద్ర‌బాబు తాము అంద‌రికి అండ‌గా ఉంటామని ప్ర‌జ‌ల‌లో ధైర్యం నింపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే కలెక్టరేట్‌లో మకాం వేశారు చంద్రబాబు. వరద సహాయక చర్యలను అక్కడి నుంచే పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో అమలునూ స్వయంగా ఏరోజుకారోజు స్వయంగా పరిశీలించారు. వరదల్లో రాకపోకలు ఇబ్బందికరమైనా ఆయన వెనక్కి తగ్గలేదు.

Chandrababu ద‌టీజ్ బాబు…

బోట్లపైనే బాధిత ప్రాంతాలకు వెళ్లారు. మొదటి రోజు రాత్రంతా తిరుగుతూనే ఉన్నారు. వరద కొంచెం తగ్గాక కార్లు తిరిగే పరిస్థితి లేకపోతే ప్రొక్లైన్‌పైనే ముంపు ప్రాంతాల్ని చుట్టేశారు. 74 ఏళ్ల వయసులోనూ రోజూ ఐదారు గంటల పాటు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు సత్వరసాయం అందేలా చేశారు. మోకాళ్లలోతు నీటిలోనూ తిరిగారు. కష్టమొస్తే ప్రభుత్వంపై అసహనం, కోపం, నిరుత్సాహంతో విరుచుకుపడే బాధితుల ఆక్రోశాన్నీ అర్ధం చేసుకుని, రోజులు గడిచేకొద్దీ వారితోనే శెభాష్ అనిపించుకున్నారు.ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా బాధితులకు అండగా ఉంటూ.. భరోసా కల్పించారు. అర్దరాత్రి సైతం బాధి తుల వద్దకు వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు.

Chandrababu : ఎట్ట‌కేల‌కి బ‌స్సు వీడి ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు... ప‌ది రోజుల పాటు ప్ర‌జ‌ల‌తోనే..!

Chandrababu : ఎట్ట‌కేల‌కి బ‌స్సు వీడి ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు… ప‌ది రోజుల పాటు ప్ర‌జ‌ల‌తోనే..!

ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు తెలియజేయాలని టోల్ ఫ్రీ నెంబర్ ఉంచారు. వరద నుంచి విజయవాడ పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉంటానని మాట ఇచ్చిన చంద్రబాబు పదిరోజులు అక్కడే ఉండి.. పరిస్థితి కుదుటపడటంతో మంగళవారం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్ళారు. అప్పటిదాకా పండగైనా, పబ్బమైనా ప్రజలతోనే.!చివరకు వినాయకచవితినీ ప్రజల మధ్యే జరుపుకున్నారు. పది రోజుల తర్వాత ఇల్లు చేరారు.ముంపు ప్రాంతాల్లో చివరి వ్యక్తికీ ప్రభుత్వ సహాయం అందాలన్నది చంద్రబాబు అభిమతం. దాని కోసం ఆయన మంత్రులు, యంత్రాంగాన్ని మోహరించారు. ఐఎఎస్, ఐపీఎస్​లనూ కార్యాలయాల నుంచి కార్యక్షేత్రంలోకి పంపారు. 32 వరద పీడిత డివిజన్లకు ఒక్కో సీనియర్‌ ఐఏఎస్‌ చొప్పున నియమించారు. 179 సచివాలయాలకు 179 మంది ఇంఛార్జుల్ని పెట్టారు. వరద వీడుతున్న ఒక్కో ప్రాంతాన్ని సాధారణ స్థితికి తెస్తూ వచ్చారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp