Ys Jagan : కూటమికి జగన్ అంటే భయం.. ఓ రేంజ్‌లో వేసుకున్న కాంగ్రెస్ నేత..!
Ys Jagan : గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారం ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటోందని తాజాగా మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ పలు ఆరోపణలు చేశారు.. సుప్రీం ధర్మాసనం టిటిడి గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అడ్వకేట్ సిద్ధార్థ్ లోత్రా సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశాడు .. అసలు లడ్డూను రాజకీయాల్లో కి […]
ప్రధానాంశాలు:
Ys Jagan : కూటమికి జగన్ అంటే భయం.. ఓ రేంజ్‌లో వేసుకున్న కాంగ్రెస్ నేత
Ys Jagan : గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారం ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటోందని తాజాగా మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ పలు ఆరోపణలు చేశారు.. సుప్రీం ధర్మాసనం టిటిడి గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అడ్వకేట్ సిద్ధార్థ్ లోత్రా సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశాడు .. అసలు లడ్డూను రాజకీయాల్లో కి ఎందుకు తీసుకొచ్చారు? కల్తీకి ఆధారాలు మీ వద్ద ఉన్నాయా? తొందరపడి నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారు? అని సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగితే రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ నుంచి జవాబు లేదు అంటూ చింతా మోహన్ ఫైర్ అయ్యారు.
Ys Jagan అక్కడ ఏం జరుగుతుంది ?
మన తిరుపతిని, మన దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం బాగా వాడుకుంటోంది. నేను ఆనాడే చెప్పాను చంద్రబాబు లడ్డు విషయంలో మాట్లాడకుండా ఉంటే బాగుండేదని. టీటీడీ ఈవో శ్యామల రావు లడ్డు, నెయ్యి విషయంలో తొందరపడ్డారు. పప్పులో కాలేశాడు. జగన్ చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది. తిరుపతిలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు, కటౌట్లు కనిపిస్తున్నాయి అని చింతా మోహన్ అన్నారు.కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు తిరుమలకు వస్తే ఏ ఉన్నతాధికారి ఆయన పక్కన ఉన్నారో సమాధానం చెప్పాలని ఆయన టీటీడీ ఈవోని ప్రశ్నించారు. అలాగే ఒక చిన్న నాయకుడు సిఫారసు చేస్తే ఎలా ఇరవై మందికి శ్రీవారి దర్శనం చేయిస్తారు అని ఈవోని నిలదీశారు.
జగన్ అంటేనే కూటమికి భయం అని కూడా చింతా మోహన్ కామెంట్స్ చేసారు. లేకపోతే నెల రోజుల పాటు తిరుమలలో అంతటా సెక్షన్ 30ని అమలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. మానవత్వం గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. సొంత ఎంపీ రఘురామకృష్ణ రాజును కొట్టించడమేనా మానవత్వం, ఇదేనా ప్రేమ అని చింతా మోహన్ ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని తెలిపారు. అయినప్పటికీ ఇంకా భక్తులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని జగన్‌పై మండిపడ్డారు. లడ్డూ వ్యవహారంతో జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందని విమర్శించారు. ఇప్పటికైనా తిరుమల లడ్డూ వ్యవహారంలో సైలెంట్‌గా ఉండమని హితవు పలికారు.