chiranjeevi and pawan kalyan working stills from rgv vyooham movie
Ram Gopal Varma : ప్రస్తుతం ఒక సినిమా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఊపేస్తోంది. అవును.. అదే వ్యూహం సినిమా. ఆ సినిమా టీజర్ ఇటీవల విడుదల కాగానే ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో అల్లకల్లోలం. దానికి కారణం.. ఆ సినిమా వచ్చేది ఏపీ రాజకీయాల మీద. దానికి దర్శకత్వం వహించేది రామ్ గోపాల్ వర్మ. ఏపీలో ఇదివరకు జరిగిన రాజకీయాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. ఈ సినిమా టీజర్ మాత్రమే కాదు.. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల ఫోటోలను కూడా ఆర్జీవీ విడుదల చేశారు.
సీఎం జగన్, ఆయన భార్య భారతిరెడ్డి ఫోటోలు విడుదల చేశారు. జగన్ ప్లేస్ లో తమిళ్ హీరో అజ్మల్ నటిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ భారతిగా మానస అనే నటి నటిస్తోంది. చంద్రబాబు ఫోటో కూడా రిలీజ్ చేశారు. తాజాగా మెగా బ్రదర్స్ ఫోటోలను కూడా విడుదల చేశారు. మెగా బ్రదర్స్ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఏపీ రాజకీయాల్లో వీళ్ల పాత్ర కూడా ఉంది కాబట్టే ఏపీ రాజకీయాల మీద సినిమా తీస్తున్నాడు కాబట్టి.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయి. వాటికి సంబంధించిన స్టిల్స్ కూడా తాజాగా బయటికి వచ్చాయి.వ్యూహం సినిమా రెండు పార్టులుగా రానుంది. ఫస్ట్ పార్ట్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, ఆయన అరెస్ట్, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం, కొత్త పార్టీ పెట్టడం లాంటివి ఉంటాయి.
chiranjeevi and pawan kalyan working stills from rgv vyooham movie
అలాగే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వైఎస్ జగన్.. కడప లోక్ సభ ఉపఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించడం.. ఇలాంటి విషయాలు అన్నీ తొలి పార్ట్ లో ప్రస్తావించనున్నారు వర్మ. ఇక రెండో పార్ట్ లో 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ, ఏపీ విడిపోయిన తర్వాత ఉండనుంది. 2014 ఎన్నికల్లో ఓడినా ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించడం, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీ.. ఇలా అన్నీ చూపించబోతున్నారు వర్మ.
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
This website uses cookies.