Home » Entertainment » Star Producer Complaint On His Wife
Entertainment

నా భార్య వాడితో అఫైర్ పెట్టుకుంది .. పోలీసుల దగ్గర స్టార్ ప్రొడ్యూసర్ కంప్లైంట్ !

Authored By
aruna
The Telugu News | Published on: June 29, 2023, 10:00 am
Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో డ్రగ్స్ కేసు బయటపడింది. ఇందులో చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల సినీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేస్ లో ఇరుక్కున్నాడు. చాలామంది ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. ప్రముఖ నటి నమిత భర్త కన్నడ నిర్మాత చంద్రశేఖర్ తన భార్య డ్రగ్స్ కు అలవాటు అయింది అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. అలాగే తన భార్య నమిత డ్రగ్స్ సరఫరా చేసే లక్ష్మిత్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు.

Advertisement

ఇంకా ఈ కేసులో సురేఖ వాణి, జ్యోతి, అషూ రెడ్డి పేర్లు వినిపించాయి. దీనిపై సురేఖ వాణి స్పందించింది. తనకు డ్రగ్స్ కేసుకు ఏమాత్రం సంబంధం లేదని స్పందించింది. అయితే ఈ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి కాల్ లిస్ట్ ఓపెన్ చేయడంతో అందులో వీరి పేర్లు వచ్చాయి. ఈ డ్రగ్స్ వ్యవహారం ఎటు దారి తీస్తుదో తెలియడం లేదు. ఇకపోతే ఈ డ్రగ్స్ కేసులో నమిత భర్త తనపై ఆరోపణలు చేశాడు. కన్నడ నిర్మాత చంద్రశేఖర్ నమితను రెండేళ్ల క్రిందట వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆమె డ్రగ్స్ కు బానిసగా మారి అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు.

Star producer complaint on his wife

Advertisement

ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయో అని అందరూ కంగారుపడుతున్నారు. అయితే నమిత మాత్రం తన భర్త ఆరోపణలను వ్యతిరేకిస్తుంది. తన భర్త తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని వాపోయింది. లక్ష్మీష్ తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అని చెబుతుంది. తన భర్త చెప్పేవన్నీ అబద్ధాలే అని కొట్టి పారేస్తుంది. తన భర్త స్నేహితులు అరుణ్, హేమంత్ తనపై దాడి చేయడానికి ప్రయత్నించారు అని చెప్పింది. ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో తెలియడం లేదు. పోలీసులు పూర్తి విచారణ చేపట్టాల్సి ఉంటుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి