Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 August 2025,1:43 pm

ప్రధానాంశాలు:

  •  Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతు ఖాతాకు 5,000 చొప్పున జమ చేసింది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా 2,000 చొప్పున రైతులకు సాయం అందించింది.

Annadata Sukhibhava అన్నదాతలకు గుడ్ న్యూస్'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల..!

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ‘అన్నదాత సుఖీభవ’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు ఖాతాకు మొత్తం 7,000 జమ అయ్యాయి. ఈ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి మొత్తం 20,000 అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలావుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కీలక ప్రకటన చేశారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) పథకం కింద 20వ విడత నిధులను ఆయన విడుదల చేశారు. ఈ విడుదలతో దేశవ్యాప్తంగా 9.70 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు 20,500 కోట్లు నేరుగా బదిలీ అయ్యాయి. ఈ పథకం రైతన్నలకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో 2019 ఫిబ్రవరి 24న కేంద్రం ప్రారంభించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది