Chandrababu : బెదిరిస్తే పారిపోయే వ్యక్తిని కాను అంటూ సీఎం చంద్రబాబు హెచ్చరిక..!
ప్రధానాంశాలు:
నీళ్ల విషయంలో తగ్గేదేలే - చంద్రబాబు
Chandrababu : రాయలసీమలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని నంద్యాల పర్యటనలో స్పష్టం చేశారు. జూలై 17 తేదీని రాయలసీమ చరిత్రలో ఒక శుభదినంగా పేర్కొన్న సీఎం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను, ఇలాంటి రోజు రావడం గర్వంగా ఉందన్నారు. రాయలసీమలో వర్షాభావం, నీటి కొరత వల్ల రైతులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తూ, గతంలో వేరుశనగ పంటలు ఎండిపోవడంతో ఇన్‌పుట్ సబ్సిడీ అందించామన్నారు. పశువులకు గడ్డి లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి రైతుల్ని ఆదుకున్న ఘటనలను గుర్తు చేశారు.

Chandrababu : బెదిరిస్తే పారిపోయే వ్యక్తిని కాను అంటూ సీఎం చంద్రబాబు హెచ్చరిక..!
Chandrababu : నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారు – చంద్రబాబు
పౌరాణిక చరిత్రలోను, సమకాలీన పాలనలోను రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడిన చంద్రబాబు, ఆయన కలలను సాకారం చేసేది తానేనన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కుల వరకు పెంచిన తీరును వివరించారు. ఈ విస్తరణతో రాయలసీమ రైతులకు భారీగా మేలు జరుగుతుందని తెలిపారు. మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేసిన ఘట్టాన్ని ఎంతో ఉద్వేగంతో వివరించిన సీఎం, ఈ రికార్డు స్థాయి పనుల్లో భాగస్వాములైన ఇంజినీర్లు, అధికారులు, కార్మికులందరికీ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఫేజ్ 2 పనులను వేగంగా పూర్తిచేసి, నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారన్న నినాదంతో, ప్రతి ఎకరాకు నీరు అందించాలన్న సంకల్పాన్ని స్పష్టం చేశారు. రైతుల జీవితాల్లో స్థిరత్వం, అభివృద్ధి తీసుకురావడమే తన ధ్యేయమని తెలిపారు. కేంద్రం సమక్షంలో జరిగిన జలశక్తి భేటీలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి పాటిస్తామని, నదుల అనుసంధానానికి ప్రధాని మోదీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.