Chandrababu : సింగయ్య భార్యతో వైసీపీనే ఆలా చెప్పేస్తుంది : సీఎం చంద్రబాబు..!
Chandrababu : పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన వైఎస్ జగన్ పర్యటనలో సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనపై తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ కేసులో సింగయ్య భార్య లూర్జుమేరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలతోనే తన భర్త మరణించడం నమ్మశక్యంగా లేదని, అంబులెన్సులో ఏదో జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. అధికారవర్గాల నుంచి, పోలీసుల నుంచి తమ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆమె వాపోయారు…
Chandrababu : సింగయ్య భార్యతో వైసీపీనే ఆలా చెప్పేస్తుంది : సీఎం చంద్రబాబు..!
పోలీసులు తమ భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపించి కాగితాలపై సంతకాలు చేయమని ఒత్తిడి చేశారట. అలాగే “లోకేష్ మనుషులం” అంటూ 50 మంది వచ్చినట్లు పేర్కొంటూ, వారి మాటలు విని సహకరించాలని బలవంతపెట్టారని, “మేము కూడా మీ కులస్తులమే” అంటూ భావోద్వేగానికి గురిచేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు చేశారామె. ఈ పరిస్థితుల్లో తాము ఎంతగా మానసిక ఒత్తిడికి గురవుతున్నామో చెప్పలేమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. “కారు కింద మనిషి పడిపోయిన తర్వాత కూడా కనీసం స్పందించకుండా, మృతుడి భార్యను మేనేజ్ చేయడానికి యత్నించారంటే అది అమానవత్వానికి నిదర్శనం” అన్నారు. సింగయ్య మరణానికి నిజమైన కారణాలు బయటకు రావాలని డిమాండ్ చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం కల్పించడమే తమ బాధ్యతగా తెలిపారు.
Hari Hara Veera Mallu Movie Trailer : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్‌స్టార్ పవన్…
Ram Charan Fans : 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చరణ్‌తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపినా,…
Buddhas Hand : ప్రపంచం లో ఇలాంటి ప్రత్యేకమైన పండు ఒకటి ఉందని మీకు తెలుసా. ఈ పండుని చాలా…
Medicinal Plants : కొన్ని శతాబ్దాల కాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాలు చికిత్సకు మెడిసిన్…
Body Donation : సాధారణంగా దానాలలో కెల్లా గొప్పదైన దానం అన్నదానం అని అంటారు. అలాగే అవయవ దానం కూడా…
Hot Water Bath : ప్రతి ఒక్కరు కూడా వేడి నీటి స్నానం అలవాటుగా ఉంటుంది. వేడి నీళ్లు లేనిదే…
Baba Vanga Prediction : అప్పట్లో జపానికి చెందిన బాబా వంగ అంచనాలు తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉండేది. ఆమె…
Jadcharla MLA : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన…
This website uses cookies.