Chandrababu : సింగ‌య్య భార్యతో వైసీపీనే ఆలా చెప్పేస్తుంది : సీఎం చంద్రబాబు.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : సింగ‌య్య భార్యతో వైసీపీనే ఆలా చెప్పేస్తుంది : సీఎం చంద్రబాబు.. వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :2 July 2025,6:40 pm

ప్రధానాంశాలు:

  •  సింగ‌య్య భార్యతో రోజుకో మాట చెప్పిస్తున్నారు - చంద్రబాబు

  •  Chandrababu : సింగ‌య్య భార్యతో వైసీపీనే ఆలా చెప్పేస్తుంది : సీఎం చంద్రబాబు.. వీడియో !

Chandrababu  : పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన వైఎస్ జగన్ పర్యటనలో సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనపై తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ కేసులో సింగయ్య భార్య లూర్జుమేరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలతోనే తన భర్త మరణించడం నమ్మశక్యంగా లేదని, అంబులెన్సులో ఏదో జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. అధికారవర్గాల నుంచి, పోలీసుల నుంచి తమ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆమె వాపోయారు…

Chandrababu సింగ‌య్య భార్యతో వైసీపీనే ఆలా చెప్పేస్తుంది సీఎం చంద్రబాబు

Chandrababu : సింగ‌య్య భార్యతో వైసీపీనే ఆలా చెప్పేస్తుంది : సీఎం చంద్రబాబు..!

Chandrababu : సింగ‌య్య భార్యతో రోజుకో మాట చెప్పిస్తున్నారు – చంద్రబాబు

పోలీసులు తమ భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపించి కాగితాలపై సంతకాలు చేయమని ఒత్తిడి చేశారట. అలాగే “లోకేష్ మనుషులం” అంటూ 50 మంది వచ్చినట్లు పేర్కొంటూ, వారి మాటలు విని సహకరించాలని బలవంతపెట్టారని, “మేము కూడా మీ కులస్తులమే” అంటూ భావోద్వేగానికి గురిచేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు చేశారామె. ఈ పరిస్థితుల్లో తాము ఎంతగా మానసిక ఒత్తిడికి గురవుతున్నామో చెప్పలేమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. “కారు కింద మనిషి పడిపోయిన తర్వాత కూడా కనీసం స్పందించకుండా, మృతుడి భార్యను మేనేజ్ చేయడానికి యత్నించారంటే అది అమానవత్వానికి నిదర్శనం” అన్నారు. సింగయ్య మరణానికి నిజమైన కారణాలు బయటకు రావాలని డిమాండ్ చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం కల్పించడమే తమ బాధ్యతగా తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది