YS Jagan : సరైన టైం వచ్చేసింది.. జగన్ ఇక లేట్ చెయ్యకూడదు.. బ్రహ్మాస్త్రం బయటకి తీయాల్సిందే..!
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏపీలో సీఎం జగన్ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. కానీ.. ఇంకా ఎన్నికలకు సంవత్సరం సమయం ఉంది. అంటే ఇంకో సంవత్సరం సీఎం జగన్ పాలన ఉంది. నాలుగేళ్లలోనే తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన జగన్.. ఏపీని అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్లారు. నాలుగేళ్లలోనే సీఎం జగన్ ఏపీలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవు. ఏపీలోని ప్రతి కుటుంబం ఏదో విధంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంలో లబ్ధిదారులే. ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక విధంగా లబ్ధి చెందినదే.
ఇంకో సంవత్సరం ఉంది ఎన్నికలకు. ఈ సంవత్సరం సమయంలో కూడా ఏపీ అభివృద్ధి కోసం, ఇంకా ఇతర సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అసలు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేరేలా కృషి చేస్తున్నారు సీఎం జగన్. అయినా కూడా ఎవరైనా, ఏ వర్గం అయినా అసంతృప్తితో ఉంటే.. వాళ్లకు కూడా న్యాయం చేయాలని సీఎం జగన్ వాళ్ల కోసం ఏదైనా చేయాలని భావిస్తున్నారు.యువత కోసం, రైతుల కోసం, అసంతృప్తిగా ఉన్న ఇతర వర్గాల కోసం సీఎం జగన్ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీయబోతున్నారు. ఎంత చేసినా, ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఏదో ఒక వర్గం అసంతృప్తిలో ఉండే మాట వాస్తవం.
YS Jagan : యువతకు మేలు చేసేలా పలు కార్యక్రమాలు ప్రారంభించనున్న సీఎం జగన్
వాళ్లు కూడా ఎందుకు అసంతృప్తిలో ఉండాలని వాళ్ల కోసం సీఎం జగన్ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసి వాళ్ల కోసం ప్రత్యేకంగా కొన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ కాదు.. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని పథకాలు అమలు చేశారు. ఇప్పుడు ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయి.. అనేది ఏపీ ప్రజలకే స్పష్టం అవుతోంది. ఈ బ్రహ్మాస్త్రంతో సీఎం జగన్ మరోసారి ఏపీలోని పలు వర్గాల్లో ఉన్న అసంతృప్తులను తీర్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ఆ బ్రహ్మాస్త్రంతో ఏపీ ప్రజలంతా ఇప్పుడు సీఎ జగన్ వైపే ఉంటారు. ఇప్పటికే ఏపీలోని 90 శాతం ప్రజలు వైసీపీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ బ్రహ్మాస్త్రంతో ఇక ఏపీలో వైసీపీ గెలుపు పక్కా.