B.R.Ambedkar Statue : సామాజిక న్యాయం మహా శిల్పం ఆవిష్కరించిన సీఎం జగన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

B.R.Ambedkar Statue : సామాజిక న్యాయం మహా శిల్పం ఆవిష్కరించిన సీఎం జగన్..!

 Authored By aruna | The Telugu News | Updated on :19 January 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  B.R.Ambedkar Statue : సామాజిక న్యాయం మహా శిల్పం ఆవిష్కరించిన సీఎం జగన్..!

B.R.Ambedkar Statue : జగన్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోని బెజవాడ స్వరాజ్యం మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం ఈరోజు ప్రారంభించారు. చరిత్రలో ఎక్కడ లేని విధంగా సామాజిక న్యాయం మహా శిల్పం ముస్తాబు చేశారు. ఇక ఈరోజు ఆ విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అయితే గతంలోనే అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ పనులు పూర్తి కాకపోవడం వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు అన్ని పనులు పూర్తిచేసుకుని ఈరోజు వైయస్ జగన్ ప్రారంభించారు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దున ఈ ప్రాంగణం ప్రపంచ స్థాయి పర్యటకులను సైతం ఆకర్షించేలా ఉంది. అంతేకాక భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహం కావడంతో మరింత ఆకర్షణగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ విగ్రహం ఎత్తు దాదాపు 206 అడుగులు ఉండగా దానిలో 81 అడుగులు బేస్ దానిపై 125 అడుగుల విగ్రహాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అలాగే రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఆకర్షించేందుకు లైటింగ్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేలా తీర్చిదిద్దారు…

ఇక ఈ ప్రాజెక్టును సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షించి అత్యంత అద్భుతంగా రూపొందించడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. అంతేకాక ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి జగన్ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమీక్షలు చేస్తూ కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలోనే దీన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేయడం జరిగింది. అయితే ఈరోజు అంబేద్కర్ స్మృతి వనం ఆవిష్కరించగా రేపటినుండి సామాన్య ప్రజలకు కూడా వనం లోకి ప్రవేశం కల్పించనున్నట్లు సమాచారం. ఇక ఈ స్మృతి వనం 18.18 ఎకరాలలో 404.35 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించడం జరిగింది. ఇక ఈ వనంలో అందమైన గార్డెన్ , వాటర్ బాడీస్ , మ్యూజికల్ ఫౌంటెన్లు , చిన్నపిల్లలు ఆడుకోవడానికి వసతి , అలాగే వాకింగ్ చేసుకోవడానికి వీలుగా తీర్చిదిద్దారు. అదేవిధంగా వాహనాలు పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందు లేకుండా తగిన సౌకర్యాలులు కల్పించారు. ఇలా అంబేద్కర్ స్మృతి వనంలో ఎన్నో అంగులు ఉన్నాయి. అలాగే దీనిలో గ్రౌండ్ , ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లు కూడా ఉన్నాయి.. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాల్స్ ఉండగా దీనిలో ఒక సినిమా హాల్, మిగిలిన మూడు అంబేద్కర్ చరిత్ర తెలిపేలా డిజిటల్ మ్యూజియాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక ఫర్స్ట్ ఫ్లోర్లో 2250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదులు ఏర్పాటు చేశారు. దీనిలో రెండు హాల్స్ లో మ్యూజియం ఒక హాల్లో లైబ్రరీ ఉన్నట్లు సమాచారం. ఇక సెకండ్ ఫ్లోర్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్స్ ఉన్నాయి. దీనిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు చాలా సుందరంగా దీనిని తీర్చిదిద్దారు. ఇక ఇది ప్రపంచంలోనే అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియంగా పేరు పొందుతుంది. అలాగే దీనిలో మినీ థియేటర్లు ,ఫుట్ కోర్ట్స్ ,కన్వెన్షన్ సెంటర్లు కూడా ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ 6,340 చదరపు అడుగులు విస్తీర్ణంలో 2000 మంది సింపుల్ గా కూర్చునే విధంగా నిర్మించారు. అదేవిధంగా ఫుడ్ కోర్టు ఎనిమిది వేలు చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్ చుట్టూ నీటి ఫౌంటైన్స్, మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటు చేశారు. ఇక ఇవన్నీ అడ్వాన్సుడ్ టెక్నాలజీతో కూడి ఉండడంతో అందరినీ ఆకర్షిస్తున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది