Congress – BJP : ఇప్పుడు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏపీ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇందుకోసం రాబోయే ఫలితాలను ఆధారంగా మార్చుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఒక విధంగా, బీజేపీ వ్యూహం ఇంకో విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉమ్మడి ఏపీని శాసించింది. బలమైన పార్టీగా ఉండేది. అంతెందుకు ఇప్పుడు ఏపీలో వైసీపీ ఏర్పడింది కూడా కాంగ్రెస్ ఓట్ల మీదనే. కాబట్టి మరోసారి ఏపీలో బలంగా మారాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఇటు తెలంగాణలో పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏపీపై దృష్టి పెడుతోంది.
ఏపీలో వైసీపీ ఓడిపోతే తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. ఎందుకంటే వైసీపీ ఓడిపోతే ఆ పార్టీలో ఉన్న నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారే కాబట్టి తిరిగి తమ గూటికి వస్తారేమో అని ఆలోచిస్తోంది. పైగా ఇప్పుడు షర్మిల అధ్యక్షురాలిగా ఉన్నారు కాబట్టి ఆమెను చూసి వైసీపీ నేతలు కాంగ్రెస్ బాట పడితే తిరిగి పుంజుకోవచ్చని అనుకుంటోంది. ఇక బీజేపీ ఆలోచన మరో విధంగా ఉంది. గతంలో 2019లో టీడీపీని దెబ్బ కొట్టి ఎదగాలని ఆశ పడింది. టీడీపీకి అయితే దెబ్బ పడింది గానీ బీజేపీ మాత్రం దారుణంగా ఓడిపోయంది. కనీసం నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు.
అయితే ఇప్పుడు మరో ప్లాన్ వేసింది బీజేపీ. ఇప్పుడు టీడీపీ, జనసేనతో పొత్తులు పెట్టుకుంది. ఏపీలో ఈ కూటమి అధికారంలోకి వస్తే ఏపీ ప్రభుత్వంలో తమ భాగస్వామ్యం ఉండాలని అనుకుంటోంది. పైగా ఏపీ ప్రభుత్వంలో మూడు మంత్రి పదవులు ఆశిస్తోంది బీజేపీ. ఒకవేళ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాకపోతే తక్షణం బీజేపీ చేసే మరో పని ఏంటంటే జనసేనను విలీనం చేసుకోవడం. ఆ తర్వాత జనసేన బలంతో టీడీపీ నుంచి కూడా నేతలను చేర్చుకుని బలంగా మారాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగూ కేంద్రంలో అధికారంలోకి వస్తామనే ధీమాతో ఇలాంటి ప్లాన్ వేస్తోంది బీజేపీ. ఇలా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలు ఏపీలో పట్టు సాధించేందుకు రెడీ అవుతున్నాయి. కానీ ఆ రెండు పార్టీలు లోకల్ పార్టీలను కాదని ఎలా ఎదుగుతాయనేది మాత్రం వేచి చూడాల్సిందే.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.