Home » Andhra Pradesh » Devineni Uma Maheswararao Gorantla Bucchaiah Chowdary Leave Tdp
andhra pradesh

TDP : టీడీపీకి గుడ్ బై చెప్పిన దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి..!

Authored By
aruna
The Telugu News | Published on: February 21, 2024, 9:00 pm
Advertisement

TDP : టీడీపీకి అత్యంత నమ్మకస్తులుగా ఉన్న నాయకులలో దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందు వరుసలో ఉంటారు. అయితే ఎంతో నమ్మకస్తులుగా ఉన్న వీరిద్దరూ తెలుగుదేశం పార్టీది వదిలేసి వెళ్ళిపోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే 77 సంవత్సరాలు ఉన్న బుచ్చయ్య చౌదరి ఈ వయసులో రిటైర్ అవ్వాల్సి ఉన్నా టిడిపిలో ఇంకా కొనసాగుతున్నారు. వైసీపీని వ్యతిరేకించడంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి టాప్ 5 ప్లేస్ లో ఉంటారు. ఇదే ప్లేస్ లో దేవినేని ఉమామహేశ్వర రావు కూడా ఉంటారు. 2019 ఎన్నికల్లో 23 ఓట్లతో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కృషి చేస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

అయితే రాజమండ్రి రూరల్ కు చెందిన టికెట్ ను గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేషనల్ వైడ్ గా పార్టీ కోసం పోరాడిన వీరిద్దరూ ఎందుకు రాజీనామా చేయడం అనేదానిపై తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే దీనికి మొదటి కారణం పొత్తును వంకగా చూపిస్తూ తనకు రావాల్సిన టికెట్ ను జనసేన పార్టీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ టికెట్ పై జనసేన ప్రకటన కూడా ఇచ్చేసింది. అసలు ఈ టికెట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రావాల్సి ఉంది. కానీ జనసేన తమ నాయకుడికి టికెట్ ఇచ్చింది. ఈ విషయంపై బుచ్చయ్య చౌదరి నిరాశ వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆయన బుజ్జగింపు చేసే ప్రయత్నం చేశారు. గౌరవప్రదంగా పార్టీ నుంచి విరమించాలనుకున్న బుచ్చయ్య చౌదరి ఈసారి ఎన్నికల్లో పాల్గొని పార్టీ నుంచి విరమించాలనుకున్నారు.

ప్రజలతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేవలం జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా తన టికెట్ ను జనసేనకు ధారపోసారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. టీడీపీ చేసిన ఈ స్వయంకృత అపరాధం వలన టీడీపీ గోరంట్ల బుచ్చయ్య వదులుకొనే పరిస్థితి వస్తుంది. వాస్తవానికి టీడీపీ ఆయనకు అన్యాయం చేసిందని చెప్పాలి. ఇక దేవినేని ఉమామహేశ్వరరావు కూడా తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడిన వారిలో ఒకరు. ఆయనకు కూడా టికెట్ దక్కలేదని కారణంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి